spot_img
Homeఎంటర్టైన్మెంట్Hari Hara Veera Mallu- Hyper Aadi: హరి హర వీరమల్లుకు హైపర్ ఆది సాయం......

Hari Hara Veera Mallu- Hyper Aadi: హరి హర వీరమల్లుకు హైపర్ ఆది సాయం… కామెడీ పంచ్ల పవర్ చూపిస్తాడట!

Hari Hara Veera Mallu- Hyper Aadi: హరి హర వీరమల్లు షూట్ పవన్ కళ్యాణ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హరి హర వీరమల్లు కంప్లీట్ చేసి పూర్తిగా రాజకీయ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. పవన్ పై హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు రూపొందిస్తున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. మరో భారీ షెడ్యూల్ కి మేకర్స్ సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.

Hari Hara Veera Mallu- Hyper Aadi
Hari Hara Veera Mallu- Hyper Aadi

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది హరి హర వీరమల్లు చిత్రానికి రచయితగా పని చేస్తున్నాడట. అయితే ఆయన పూర్తి స్థాయిలో కాదు. కేవలం కామెడీ ఎపిసోడ్స్ కి హైపర్ ఆది డైలాగ్స్ రాస్తున్నారట. టైమింగ్ కామెడీ పంచ్లకు హైపర్ ఆది పెట్టింది పేరు. మనోడి స్కిట్స్ చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. హైపర్ ఆది స్కిట్స్ లో నాన్ స్టాప్ కామెడీ పంచెస్ నవ్వులు పూయిస్తాయి. ఈ క్రమంలో హరి హర వీరమల్లు కామెడీ సన్నివేశాలకు అతడి సాయం తీసుకుంటే బెటర్ ని మేకర్స్ భావించారట. దర్శకుడు క్రిష్… హరి హర వీరమల్లు కామెడీ ఎపిసోడ్స్ కి హైపర్ ఆది చేత డైలాగ్స్ రాయించారని విశ్వసనీయ సమాచారం అందుతుంది.

ఇక హరి హర వీరమల్లు చిత్రానికి పూర్తి స్థాయి రచయితగా సాయిమాధవ్ బుర్రా పని చేస్తున్నారు. ఈ మధ్య భారీ ప్రాజెక్ట్స్ కి ఆయనే రచయితగా పని చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సైతం మాటలు అందించింది ఆయనే. ఇక కొన్నాళ్లుగా క్రిష్ చిత్రాలకు సాయి మాధవ్ బుర్రానే రచయితగా వ్యవహరిస్తున్నారు. కేవలం కామెడీ సన్నివేశాల కోసం హైపర్ ఆదిని ఇన్వాల్వ్ చేశారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో హైపర్ ఆది కామెడీ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

Hari Hara Veera Mallu- Hyper Aadi
Hari Hara Veera Mallu

పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది. నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మొఘలుల కాలం నాటి బందిపోటు వీరుడి కథగా హరి హర వీరమల్లు రూపొందుతుంది. మొగలులను ముప్పతిప్పలు పెట్టే వీరుడి పాత్రలో పవన్ పోరాటాలు, విన్యాసాలు అబ్భురపరచనున్నాయి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper