India vs Sri Lanka 2023:: ఆస్ట్రేలియాలో జరిగిన టి20 మెన్స్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై ఎదురైన దారుణ పరాజయాన్ని టీమిండియా మర్చిపోలేకపోతోంది. ఈ క్రమంలో జట్టులో అనేక మార్పులు చేసినప్పటికీ పెద్దగా ఫలితం రావడం లేదు. మరో ఏడాదిలో టి20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కప్ ఒడిసి పట్టాలని టీం ఇండియా సన్నాహాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా శ్రీలంకతో టి20 సిరీస్ కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకుండానే బరిలోకి దిగుతోంది. పూర్తి యువ రక్తంతో నిండిన బృందానికి హార్దిక్ పాండ్యా నేతృత్వం వహిస్తున్నారు.

ఓపెనింగ్ ఎవరు చేస్తారు
బంగ్లాదేశ్ లో డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ తుది జట్టులో స్థానం కోసం పోటీలో ఉన్నారు. ఒకవేళ ఇద్దరూ ఉంటే మాత్రం ఇషాన్ ఓపెనర్ గా రావడం ఖాయం. అతనితో పాటు రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాడు. వీరిద్దరికీ ఐపీఎల్లో తమ ప్రాంచైజీల తరఫున ఓపెనర్లుగా ఆడిన అనుభవం ఉంది. ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు అంతర్జాతీయ టి20 లో అడుగుపెట్టని శుభ్ మన్ గిల్ ను ఓపెనర్ గా పంపించే అవకాశం లేకపోలేదు.. ఇక మూడో స్థానంలో సూర్య కుమార్ యాదవ్ వస్తాడు. నాలుగులో సంజు శాంసన్, ఐదో స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ దీపక్ హుడా బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది.. ఒకవేళ సంజు కాకుండా రాహుల్ త్రిపాటికి అవకాశం ఇస్తే మాత్రం అతడే సెకండ్ టౌన్ లో ఆడతాడు.. సంజు కు అనుభవం ఉన్న నేపథ్యంలో ఎక్కువ అవకాశాలు ఇవ్వచ్చు.
ఆరుగురు బౌలర్లు
హార్దిక్ పాండ్యా తొలి నాలుగు స్థానాలను బ్యాటలతో భర్తీ చేస్తాడు. ఎందుకంటే కదా మ్యాచుల్లో అతడు ఇదే విధానాన్ని అనుసరించాడు.. దీపక్ కూడా బౌలింగ్ వేయగలడు. కాబట్టి జట్టులో ఉండే అవకాశం ఎక్కువ.. ఇక స్పిన్ ఆల్రౌండర్లు సుందర్, అక్షర్ పటేల్ లో ఒకరికి మాత్రమే అవకాశం దక్కే వీలు ఉంటుంది.. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో యజ్వేంద్ర చాహల్ ఆడే అవకాశం ఉంది. ఇక ఫాస్ట్ బౌలర్ల విషయానికొస్తే అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ ను కాదని కొత్త బౌలర్ల వైపు ఆలోచించడం కష్టమే.. అయితే అన్ క్యాప్ డ్ ప్లేయర్లు శివమ్ మావి, ముఖేష్ కుమార్ వేచి చూడక తప్పదు.. అయితే వీరికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఇస్తామని ద్రవిడ్ పేర్కొన్నాడు.

తక్కువ చేయొద్దు
ఆసియా కప్ విజేత శ్రీలంకలో తక్కువ అంచనా వేయడం పొరపాటే.. ఎందుకంటే ఆ జట్టు యువ రక్తంతో అలరారుతోంది.. పైగా అందులో స్టార్ ప్లేయర్లు ఉన్నారు.. ఇటీవల తమ దేశంలో జరిగిన సీరిస్ లో ఆస్ట్రేలియా జట్టును ఒక ఆట ఆడుకున్నారు. ఆవిష్క ఫెర్నాండో, చమిక కరుణరత్నే, సదీరా సమర విక్రమ, డాసున్ శనక, కుషాల్ మెండీస్, భానుక రాజ పక్స, హసరంగ, తీక్షణ మ్యాచ్ ను మలుపు తిప్పగల సత్తా ఉన్న ఆటగాళ్లు. కుషాల్ మెండీస్ గత ఆసియా కప్ లో భారత్ కు చుక్కలు చూపించాడు. ఏకంగా ఆ జట్టును ఫైనల్ తీసుకెళ్లాడు. కప్ కూడా అందించాడు. అందుకే లంక జట్టును తక్కువ అంచనా వేయొద్దు..