Health Tips: ఉప్పు మన ఆరోగ్యానికి ముప్పే. రుచి కోసం వేసుకున్న ఉప్పుతో మనకు అనేక రోగాలకు మూలం అవుతుంది. ప్రతిరోజు మనం తీసుకునే ఉప్పు పరిమితికి మించి ఉంటోంది. దీంతో మన అవయవాలు దెబ్బ తింటున్నాయి. కానీ నిర్లక్ష్యంతోనే ఉంటున్నాం. ఫలితంగా అన్ని భాగాలను నాశనం చేసే తెల్ల పదార్థం ఉప్పే కావడం గమనార్హం. ఉప్పు తినకపోతే బీపీ తగ్గుతుందనేది అపోహ మాత్రమే. బీపీ తగ్గడానికి నీరు తక్కువగా తీసుకోవడమే ప్రధాన కారణం. ఉప్పుతో మనకు కలిగే ఉపద్రవాలను ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతోనే చిన్న వయసులోనే బీపీ, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్, క్యాన్సర్ వంటి రోగాలకు మూలం అవుతోంది.

ఉప్పుతో మనకు రక్తపోటు ప్రమాదం ఉంటుంది. ఉప్పు అధికంగా తింటే అధిక రక్తపోటు పెరుగుతుంది. దీంతో గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు తెస్తుంది. ఉప్పుతో మనకు ఎంతో నష్టం కలుగుతుందని తెలిసినా దాన్ని విడిచిపెట్టడం లేదు. కొందరైతే ఉప్పు తగ్గిందని తినేటప్పుడు జల్లుకుని తినడం చూస్తుంటాం. ఇది మరీ డేంజర్. ఉప్పును ఎంత తక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. అందుకే ఉప్పును మితంగా తీసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వండి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఉప్పుతో మనకు నష్టాలే ఎక్కువ అని చెబుతోంది. ఉప్పు వాడకంలో నిగ్రహం పాటించకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రతి రోజు మనం ఐదు గ్రాముల ఉప్పుకంటే ఎక్కువ తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం, జీర్ణాశయ క్యాన్సర్లు, కిడ్నీల్లో రాళ్లు, ఎముకలు గుల్లబారడం, ఊబకాయం, ఉబ్బసం, కండరాలు పట్టేయడం వంటి రోగాలు రావడం సహజమే. అందుకే ఉప్పును తగ్గించుకుని వాటి నుంచి దూరంగా ఉండాలి.
అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని ఉప్పు గురించి చెబుతుంటారు. నిజమే ఉప్పు ఉంటే పదార్థాలు రుచిగా ఉంటాయి. కానీ వాటితోనే మనకు ప్రమాదం. రోజుకు ఒక స్పూన్ ఉప్పు తింటే ఏం కాదు. కానీ అంతకంటే ఎక్కువ తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. రోజంతా మనం మూడు పూటలా ఉడికిన ఆహారాలే తీసుకోవడంతో అందులో ఉప్పు శాతం ఎక్కువగానే ఉంటోంది. దీంతో మనకు రోగాలు రావడానికి దోహదపడుతోంది. ఉప్పును రోజు నాలుగు గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల నష్టమే.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం మనదేశంలో ప్రతి ఒక్కరూ రోజుకు సగటున 9-12 గ్రాముల ఉప్పు తింటున్నారని చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉప్పు వినియోగం 42 గ్రాముల వరకు ఉంటోందని జర్నల్ ఆఫ్ హైపర్ టెన్షన్ లో ప్రచురితమైన మరో అధ్యయనం వెల్లడించింది. ఇలా ఉప్పును మనం అపరిమితంగా ఉపయోగించడంతోనే మనకు రోగాలు వస్తున్నాయి. దీంతో ఉప్పు వాడకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలి.