Pavitra Lokesh- Naresh Marriage: పవిత్ర లోకేష్ ని నరేష్ ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆమెను సొంతం చేసుకునేందుకు నరేష్ కోట్లు కుమ్మరించేందుకు సిద్ధం అయ్యాడట. విడాకుల భరణంగా ఆయన రమ్య రఘుపతికి ఎంత చెల్లిస్తున్నాడో తెలిస్తే మతిపోవడం ఖాయం. నరేష్-పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నరేష్ స్వయంగా వెల్లడించారు. వీరిద్దరూ వివాహం చేసుకున్నారని వార్తలు రాగా… నరేష్ స్పష్టత ఇచ్చారు. పవిత్ర లోకేష్ నేను వివాహం చేసుకోలేదు. కలిసి జీవిస్తున్నామంతే. వివాహ వ్యవస్థపై నాకు నమ్మకం లేదు. ప్రస్తుతానికి పవిత్రను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను అన్నారు.

పవిత్ర లోకేష్ మెడలో నరేష్ తాళి కట్టకపోవడానికి కారణం… మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు మంజూరు కాకపోవడమే అని సమాచారం. రమ్య రఘుపతి కూడా ఈ ఆరోపణ చేశారు. నాకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో ఆయన సంబంధం ఎలా పెట్టుకుంటాడు? వివాహం ఎలా చేసుకుంటాడు?. నరేష్-పవిత్రల బంధాన్ని నేను అంగీకరించను అని ఆమె ఫైర్ అయ్యారు. మైసూర్ హోటల్ గదిలో ఉన్న నరేష్-పవిత్రలపై రమ్య రఘుపతి దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ హైడ్రామా చోటు చేసుకోగా పోలీసులు రంగంలోకి దిగారు.
తాజాగా నరేష్ పెళ్లి ప్రకటన చేశారు. పవిత్ర లోకేష్ ని అధికారికంగా వివాహం చేసుకోనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. పవిత్రను ముద్దాడుతూ ఒక రొమాంటిక్ వీడియో విడుదల చేశారు. నరేష్ ప్రకటనపై రమ్య రఘుపతి పెదవి విప్పలేదు. ఆమె ఏ విధంగా ఖండించలేదు. ఆమె పెళ్లి ప్రకటన ఖండించక పోవడానికి కారణం… నరేష్ తో సెటిల్మెంట్ పూర్తి అయిందంటున్నారు. రమ్య రఘుపతితో నరేష్ కి అధికారికంగా విడాకులు అయ్యాయట. భరణం లెక్క తేలడంతో రమ్య నరేష్ తో విడాకులకు ఒప్పుకొని వివాదం ముగించారు అంటున్నారు.

మరి రమ్య రఘుపతికి భరణంగా నరేష్ ఎంత ఇచ్చాడని ఆరా తీయగా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. రమ్య రఘుపతి జీవితాంతం ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రతికేలా నరేష్ సెటిల్ చేశాడట. కచ్చితంగా ఇంత ఇచ్చాడు అనే మేటర్ బయటకు రాలేదు. నరేష్ సన్నిహితులు, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… నరేష్ కి వందల కోట్ల ఆస్తి ఉంది. వారి అమ్మగారి ద్వారా ఆయనకు పెద్ద మొత్తంలో సంక్రమించింది. ఇక ఎంతైనా ఇచ్చి రమ్య రఘుపతితో సెటిల్ చేసుకోవాలని ఆయన భావించారని చెప్పుకొచ్చారు. ఒక అంచనా ప్రకారం రూ. 10 కోట్లకు పైనే రమ్యకు ఆయన భరణం చెల్లించారు.