Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh new constituencies: పార్లమెంటుకు పునర్విభజన బిల్లు.. ఏపీలో పెరగబోయే నియోజకవర్గాలు ఇవే!

Andhra Pradesh new constituencies: పార్లమెంటుకు పునర్విభజన బిల్లు.. ఏపీలో పెరగబోయే నియోజకవర్గాలు ఇవే!

Andhra Pradesh new constituencies: ఏపీలో( Andhra Pradesh) నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పునర్విభజనతో ఏపీలో 75 అసెంబ్లీ సీట్లతో పాటు ఏడు నుంచి ఎనిమిది పార్లమెంటు సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. జనగణన పూర్తయిన వెంటనే ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. 2027 ద్వితీయార్థంలో ప్రక్రియ మొదలుకానుంది. 2008లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి రిజర్వేషన్లను సైతం ఖరారు చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జనాభా ప్రాతిపదికన ఈ నియోజకవర్గాల పునర్విభజన ఉండనుంది. తరువాత రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.

నియోజకవర్గాల సంఖ్య పెంపు..
ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరో 25 పార్లమెంటు సీట్లు కొనసాగుతున్నాయి. పునర్విభజనతో మరో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. దీంతో వీటి సంఖ్య 225 కు చేరుకోనుంది. మరోవైపు ఏడు నుంచి ఎనిమిది పార్లమెంటు స్థానాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీలో 32 లేదా 33 పార్లమెంట్ స్థానాలు వరకు పెరగనుంది సంఖ్య. రిజర్వేషన్లు సైతం పక్కాగా అమలు చేస్తారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ స్థానాన్ని రిజర్వుడ్ నియోజకవర్గంగా కేటాయించనున్నారు. మహిళా రిజర్వేషన్లు సైతం అమలు చేయనున్నారు. 225 అసెంబ్లీ సీట్లకు గాను 75 నియోజకవర్గాలను మహిళలకు కేటాయించనున్నారు.

విభజన సమయంలోనే..
వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని భావించారు. విభజన చట్టంలో సైతం స్పష్టం చేశారు. కానీ ఇప్పటివరకు అమలు కాలేదు. తాజా పరిణామాలతో ఈ అంశం మళ్లీ రాజకీయంగా హార్ట్ టాపిక్ అవుతోంది. త్వరలో కేంద్రం పార్లమెంటులో పునర్విభజన బిల్లు పెట్టనున్నట్లు తెలుస్తోంది. 2029 నాటికే పునర్విభజన తో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే పునర్విభజన అనేది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. చివరిసారిగా 2008లో నియోజకవర్గాల పెంపు జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కు అనుకూలం అయిందన్న ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా ఎన్డీఏ కు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

రాజ్యసభ పదవులు సైతం..
మరోవైపు ఏపీ నుంచి రాజ్యసభ పదవులు సైతం పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పెరిగిన అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా ఏపీ నుంచి 16 రాజ్యసభ స్థానాలు లభించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఏపీ నుంచి 11 రాజ్యసభ సీట్లు మాత్రమే ఉండేవి. లోక్సభ స్థానాలు 32 నుంచి 33 పెరిగే అవకాశం ఉంది. ఈ మొత్తం పునర్విభజనతో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే ఎంపీల సంఖ్య 49కి పెరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పునర్విభజనతో చాలామంది రాజకీయ ఆశావహులకు అవకాశాలు మెరుగు పడనున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version