S. S. Rajamouli: రాజమౌళి-మహేష్ మూవీ ఆయన గత చిత్రాలు రికార్డ్స్ బ్రేక్ చేసేలా… మరింత హంగులు, ఆర్భాటాలతో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ గురించి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ మూవీ లవర్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మహేష్ మూవీ కోసం రాజమౌళి బడ్జెట్ డబుల్ చేశారట. దాదాపు రూ. 800 నుండి 1000 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నట్లు సమాచారం. సాంకేతికంగా మరింత ఉన్నతంగా మూవీ ఉండాలనేది రాజమౌళి ఆలోచన. అందుకే మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, హాలీవుడ్ మూవీ లను తలదన్నేలా తెరకెక్కించాలనే నిశ్చయంతో ఉన్నారు.

మహేష్ చిత్రానికి పెద్ద మొత్తంలో హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలతో విఎఫ్ఎక్స్ వర్క్ కోసం రాజమౌళి ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక తన మూవీ కథ ఏమిటో ముందే చెప్పేయడం రాజమౌళికి ఉన్న అలవాటు. విషయం మొత్తం ముందే లీక్ చేసి కూడా సినిమాపై అంచనాలు, ఆసక్తి పెంచడం ఆయన ప్రత్యేకత. ఇక మహేష్ మూవీ ఏ జోనర్లో చేస్తున్నాడో ఆల్రెడీ వెల్లడించారు. ఇది జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు కథ అన్నారు.
కాగా ఈ చిత్రానికి కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ అప్డేట్స్ మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా మహేష్ మూవీకి సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించి అతిపెద్ద సంచలనానికి తెరలేపారు. మూవీలోని ప్రధాన పాత్రలు అలానే ఉంటాయి. కథ మారుతూ ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బాహుబలికి మించి పెద్ద ఎత్తున మహేష్ మూవీ రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని అర్థం అవుతుంది. ఇది మహేష్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఎన్ని సీక్వెల్స్ ఉంటాయనేది విజయేంద్ర ప్రసాద్ వెల్లడించలేదు.

ఆయన మొదటి భాగానికి స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. మరో ప్రక్క ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే లేదా జూన్ నుండి మూవీ రెగ్యులర్ షూట్ మొదలుపెట్టే ఆలోచన ఉందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అదే సమయంలో మహేష్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. మహేష్ మంచి నటుడు. ఆయనకు యాక్షన్ చిత్రాలు బాగా సెట్ అవుతాయి. మహేష్ లాంటి హీరోకి కథ రాయడం మజా ఇస్తుందని చెప్పుకొచ్చారు. కెరీర్లో మొదటిసారి రాజమౌళితో మహేష్ మూవీ చేస్తున్నారు. వీరిద్దరూ పరిశ్రమకు వచ్చి ఇన్నేళ్లు అవుతు న్నా మూవీ సెట్ కాలేదు. ఆర్ ఆర్ ఆర్ కి ముందే మహేష్ తో రాజమౌళి మూవీ చేయాల్సి ఉంది. వాయిదా పడుతూ వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎట్టకేలకు సెట్ అయ్యింది.