Homeబిజినెస్Tata Tiago: మూడు ఇంజన్లు.. ధర మాత్రం రూ.5 లక్షల లోపే.. సామాన్యులు ఈ కారును...

Tata Tiago: మూడు ఇంజన్లు.. ధర మాత్రం రూ.5 లక్షల లోపే.. సామాన్యులు ఈ కారును కొనవచ్చు..

Tata Tiago: నేటి కాలంలో సామాన్యుల సైతం కారు ఉండాలని కోరుతూ ఉన్నారు. అయితే వీరు బడ్జెట్లోనే కారు ఉండాలని అనుకుంటున్నా తరుణంలో కొన్ని కంపెనీలు తక్కువ ధరలోనే ఫోర్ వెహికల్స్ అందించేందుకు ముందుకు వస్తున్నాయి. తక్కువ ధరలో కార్లు అనగానే వీటిలో పరిమితంగా ఆప్షన్స్ లేదా ఒకటి లేదా రెండు ఇంజన్లు మాత్రమే ఉంటాయని భావించేవారు ఉంటారు కానీ Tata కంపెనీ మూడు ఇంజన్ల ఆప్షన్లతో పాటు అడ్వాన్స్ ఫీచర్లు అన్ని ఉంచి అతి తక్కువ ధరకే ఓ కారును అందిస్తోంది. దీనిపై కేవలం మిడిల్ క్లాస్ పీపుల్స్ మాత్రమే కాకుండా ప్రీమియం కార్లు కొనేవారు కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2025 సంవత్సరం కంటే 2026 ఫిబ్రవరిలో ఈ కారు అత్యధికంగా అమ్మకాలు జరుపుకుంది. ఇంతకీ ఇది ఏ కారు తెలుసుకోవాలని ఉందా?

భారతదేశంలో కార్ల విక్రయాల్లో టాప్2 గా నిలుస్తోంది Tata కంపెనీ. ఈ కంపెనీకి చెందిన Tiago అత్యధికంగా విషయాలు జరుపుకుంటున్న కారుగా నిలుస్తుంది. ఈ కారు 2025 ఫిబ్రవరిలో 6954 విక్రయాలు జరుపుకుంటే… 2026 ఫిబ్రవరిలో 7040 కార్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది కంటే ఒక శాతం వృద్ధి నమోదైనట్లు తెలుస్తోంది. ఇది చిన్న కారు అయినప్పటికీ మూడు రకాల ఇంజన్లతో అందుబాటులో ఉంది. వీటిలో ఒకటి పెట్రోల్, CNG తోపాటు ఎలక్ట్రిక్ వేరియంట్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కారుకు డిమాండ్ బాగా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 19.2 kWh నుంచి 24 kWh వరకు ఇంజన్ ఉండనుంది. దీనిని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 293 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. 58 నిమిషాల్లోనే 10 నుంచి 80% వరకు చార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని ధర రూ. 7.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తుంటారు.

అలాగే టాటా టియాగో పెట్రోల్ కారులో 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్ ఉండనుంది. ఇది 86 పవర్ తో పాటు వన్ వన్ త్రీ nm టర్క్ రిలీజ్ చేయనుంది. ఈ కారు ధర 4.57 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఈ కారు లీటర్ ఇంధనానికి 19 నుంచి 20 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇక CNG కారు ధర 6.66 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఈ ఇంజన్ కిలో ఇందరానికి 26. 49 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. సామాన్యులు తక్కువ ధరకు కారు కొనాలని అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఈ కారు ధరతోపాటు సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనిని గ్లోబల్ క్రాస్ లిస్టులో నిర్వహించగా 4 స్టార్ రేటింగ్ పొందడం విశేషం. అంతేకాకుండా ఇందులో సెవెన్ అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తో పాటు ఆటో ఆండ్రాయిడ్, ఆపిల్ కార్ ప్లే, 8 స్పీకర్ ఆడియో సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version