కుమారి 21ఎఫ్ లాంటి ఘాటు రోమాంటిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్ ఇప్పటికీ కురుచ దుస్తులు ధరిస్తూ తన అందచందాలను ఆరబోస్తూనే ఉంటుంది. కరోనా లాక్ డౌన్ లో అది కాస్తా ఎక్కువైంది.
కరోనాతో సినిమా షూటింగ్ లన్నీ బంద్ కావడంతో హెబ్బా పటేల్ ఇప్పుడు సోషల్ మీడియాపై పడింది. తన అందచందాలను గ్లామర్ డోస్ పెంచి మరీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అబ్బాయిలకు నిద్రలేకుండా చేస్తోంది.
అందాల ‘హెబ్బా పటేల్’కి ఈ మధ్య పెద్దగా సినిమాలు లేవు. ప్లాప్ ల వలయంలో హీరోయిన్ గా విలువ కోల్పోయి.. ఛాన్స్ లు కోసం హెబ్బా తెగ ఆశగా ఎదురుచూస్తోంది. నిజానికి చిన్న సినిమాతో అప్పట్లో ఫుల్ డిమాండ్ తెచ్చుకుంది. అసలు మూడు సంవత్సరాల క్రితం వరకూ హెబ్బాకి ఉన్న డిమాండ్ చూస్తే, తోటి చిన్నాచితకా హీరోయిన్స్ అందరూ.. హెబ్బా అంటేనే అబ్బా అనుకున్నేవాళ్లు. కానీ వచ్చిన సక్సెస్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో హెబ్బా మిస్ లీడ్ అయింది.
దాంతో వరుస అవకాశాలతో మంచి జోరు మీదున్న హెబ్బా కెరీర్, ఒక్కసారిగా రివర్స్ అయింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకునే హెబ్బాకి, చివరకు అవకాశమే లేకుండా పోయింది. అందుకే ఛాన్స్ ల కోసం మళ్ళీ తనలోని గ్లామర్ బ్యూటీని నిద్ర లేపింది. వరుస హాట్ ఫోటోషూట్ లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. తాజాగా హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది.
తాజాగా అన్నీ కనిపించేలా ఫొటో దిగి దాన్ని షేర్ చేసిన హీరోయిన్ హెబ్బాపటేల్ ‘బయటకు వెళ్లడం తక్కువైంది. పొట్టి దుస్తులు ధరించడం మొదలుపెట్టాను’ అంటూ ఘాటుగా వ్యాఖ్యను జోడించి తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది.