Viral Video: ఆ బిజీ రోడ్డుపై నడవడమే కష్టం అనుకుంటే.. కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.. ఆ తర్వాత ట్రక్కు ఏం చేసిందంటే..

అది అత్యంత బిజీగా ఉండే రోడ్డు. నిత్యం వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉంటుంది. మామూలు సమయాల్లోనే ఆ రోడ్డున దాటాలంటే ప్రజలు నరకం చూస్తారు.. అలాంటి చోట ఓ వ్యక్తి ఆ రోడ్డు తన సొంత ఆస్తి అయినట్టు.. కుర్చీ తెచ్చుకొని వేసుకుని దర్జాగా కూర్చున్నాడు. అతడు కూర్చున్న సమయంలో వర్షం కురుస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 3, 2024 10:08 am

Viral Video(2)

Follow us on

Viral Video: వాస్తవానికి ఆ రోడ్డు బిజీగా మారడంతో భారీ వాహనాల రాకపోకలను ఇటీవల అధికారులు నిలుపుదల చేశారు. అయినప్పటికీ ఇతర వాహనాలు ఆ రోడ్డుమీదుగా ప్రయాణం సాగిస్తూనే ఉన్నాయి. ఫలితంగా ఆ రోడ్డు మొత్తం నిత్యం రద్దీగా కనిపిస్తోంది. అయితే అలాంటి రోడ్డుమీద ఓ వ్యక్తి కుర్చి వేసుకుని కూర్చున్నాడు. అదే సమయంలో ఒక ట్రక్కు అటువైపుగా వచ్చింది. వాస్తవానికి భారీ వాహనాల రాకపోకలు ఆ రోడ్డు మీద నిలిపివేసినప్పటికీ అది ఎలా వచ్చిందో స్థానికులకు అంత పట్టడం లేదు.. అలా వచ్చిన ట్రక్ ఆ కుర్చి మీద కూర్చున్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతడు కూర్చున్న కుర్చీ విరిగిపోయింది. ఆ ట్రక్కు గుద్ది అలా వెళ్ళిపోవడంతో ఆశ్చర్యపోవడం ఆ వ్యక్తి వంతయింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆ ట్రక్కు డ్రైవర్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు.. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ సందడి చేస్తోంది. ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. కొందరు దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేశారు. ఆ కుర్చీ మీద కూర్చున్న వ్యక్తి నలుపు రంగు షార్ట్ వేసుకున్నాడు. అయితే అతడికి మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. రాత్రివేళ వర్షం కురుస్తున్న సమయంలో తన విపరీతమైన ప్రవర్తనతో ఇతరులకు ఇబ్బంది కలిగించాడు.. రోడ్డు మధ్యలో కూర్చొని వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించాడు. రోడ్డు మధ్యలో అక్కడ కూర్చున్నప్పటికీ స్థానికులు అతడిని నిలువరించలేదు. అతడు రోడ్డు మధ్యలో కూర్చోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొంతమంది వాహన డ్రైవర్లు అటుపక్కగా వెళ్లిపోయారు. అయితే ఒక ట్రక్ డ్రైవర్ కు మాత్రం ఆ వ్యక్తి వ్యవహార శైలి నచ్చలేదు. పైగా నడిరోడ్డు మీద కుర్చి వేసుకొని కూర్చున్న అతడికి సరైన బుద్ధి చెప్పాలని భావించాడు. అంతే మరో మాటకు తావు లేకుండా తన ట్రక్కుతో ఒక గుద్దుడు గుద్దాడు. దీంతో ఆ వ్యక్తి కిందపడ్డాడు. అతడు కూర్చున్న కుర్చీ విరిగిపోయింది.

వేగంగా వచ్చిన ట్రక్కు

అంతకుముందు ఆ ట్రక్కు వేగంగానే వచ్చింది. నడిరోడ్డు మధ్యలో ఆ వ్యక్తి కూర్చోవడంతో ఒక్కసారిగా వేగాన్ని నియంత్రించాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి రోడ్డు మీద నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించలేదు.. దీంతో ఆ ట్రక్ డ్రైవర్ రోడ్డుకు పక్కగా పోనిచ్చేందుకు ప్రయత్నించాడు.. అయినప్పటికీ ఆ ట్రక్ భాగం అతడు కూర్చున్న కుర్చీని లాగేసింది. దీంతో ఆ వ్యక్తి కింద పడిపోయాడు. అటువైపు పడ్డాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది కాలేదు. ఒకవేళ ఇటువైపు పడి ఉంటే గోడకు ఫోటో రూపంలో వేలాడేవాడు.

వేలల్లో వ్యూస్

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇప్పటికే ఇది వేలల్లో వ్యూ సొంతం చేసుకుంది. కొంతమంది ట్రక్ డ్రైవర్ తీరును తప్పుపడుతుంటే.. మరికొందరు ఆ వ్యక్తి వ్యవహార శైలిని విమర్శిస్తున్నారు..”మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి రోడ్డుమీదికి వస్తే ఇలానే ఉంటుందేమో. అతడిని వారించే ప్రయత్నం స్థానికులు చేయలేదు. దీంతో అతడు దర్జాగా రోడ్డు మీద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. పైగా వర్షం కురుస్తున్న సమయంలో అతడు అలాంటి పని చేయడం అటువైపుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలిగించింది.. కానీ ఒక ట్రక్ డ్రైవర్ కు ఒళ్ళు మండింది. ఇంకేముంది ఆ ట్రక్ ను ఆ రోడ్డు మీదుగా పోనిచ్చాడు. దీంతో అతడు కిందపడ్డాడు. కూర్చున్న కుర్చీ విరిగిపోయింది. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమే అయినప్పటికీ.. మున్ముందు ఇలాంటి ప్రయత్నాలు మరొకరు చేయరు” అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.