Homeట్రెండింగ్ న్యూస్Harsh Goenka Tweet: చంద్రగ్రహణం ఎఫెక్ట్ : నలుగురు ప్రధానులు ఔట్.. నెక్ట్స్ ట్రంప్...

Harsh Goenka Tweet: చంద్రగ్రహణం ఎఫెక్ట్ : నలుగురు ప్రధానులు ఔట్.. నెక్ట్స్ ట్రంప్ నా? మోదీనా?

Harsh Goenka Tweet: పారిశ్రామికవేత్త గోయెంకా.. ఆసక్తికరమైన అంశాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. తాజాగా ప్రపంచ రాజకీయాలను చంద్రగ్రహణంతో లింక్‌ చేస్తూ.. ఆయన చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతోపాటు చర్చనీయాంశమైంది. సెప్టెంబర్‌ 7, 2025న సంభవించిన చంద్రగ్రహణం తర్వాత రెండు రోజుల వ్యవధిలో జపాన్, ఫ్రాన్స్, నేపాల్, థాయిలాండ్‌ దేశాల ప్రధానమంత్రులు పదవులు కోల్పోయారని, ఇది చంద్రగ్రహణం యొక్క ప్రభావమేనని గోయెంకా ట్వీట్‌ అర్థం. ఇదే పోస్టులో రాబోయే సూర్యగ్రహణం తర్వాత ‘‘ఆరెంజ్‌ టింటెడ్‌’’ లీడర్‌ కూడా పదవి కోల్పోవచ్చని జోస్యం చెప్పడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.

చంద్రగ్రహణంతోనే రాజకీయ పతనమా?
చంద్రగ్రహణం ఒక ఖగోళ సంఘటన. ఇది భూమి సూర్యుడు, చంద్రుడి మధ్యకు వచ్చినప్పుడు ఏర్పడుతుంది. సెప్టెంబర్‌ 7, 2025న భారతదేశంతో సహా ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. చంద్రగ్రహణం మానసిక స్థితి, ఆరోగ్యం, కెరీర్‌పై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ముఖ్యంగా కుంభం, కర్కాటకం, మీన రాశులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే, ఈ ఖగోళ సంఘటన నలుగురు ప్రధానమంత్రుల పదవీ చలనానికి నేరుగా కారణమని శాస్త్రీయంగా నిరూపణ లేదు. గోయెంకా ట్వీట్‌ ఈ రాజకీయ మార్పులను చంద్రగ్రహణంతో జోడించడం ఆసక్తికరంగా మారింది.

రాజకీయ అస్థిరతకు గ్రహణం ఎఫెక్ట్‌..
జపాన్, ఫ్రాన్స్, నేపాల్, థాయిలాండ్‌లలో ప్రధానమంత్రులు పదవులు కోల్పోవడం వెనుక రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాలు. నేపాల్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక నిరసనలు (19 మంది మృతి) రాజకీయ అస్థిరతకు కారణమయ్యాయని వార్తలు తెలిపాయి. జపాన్‌లో ఆర్థిక సంక్షోభం లేదా అంతర్గత రాజకీయ ఒడిదొడుకులు, ఫ్రాన్స్‌లో ఎన్నికల ఫలితాలు లేదా విధాన వైఫల్యాలు, థాయిలాండ్‌లో ప్రజా అసంతృప్తి వంటివి ఈ మార్పులకు కారణాలు. గోయెంకా ఈ ఘటనలను చంద్రగ్రహణంతో అనుసంధానించడం ఒక రకమైన జ్యోతిష్య సంబంధిత ఊహాగానం. కానీ ఇది శాస్త్రీయ ఆధారాలతో సమర్థించబడలేదు. ఈ ట్వీట్‌ రాజకీయ సంఘటనలను ఖగోళ ఘటనలతో ముడిపెట్టే సాంప్రదాయ ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. ఇది చాలా మంది నమ్మే ఒక సాంస్కృతిక విశ్వాసం కావచ్చు.

‘‘ఆరెంజ్‌ టింటెడ్‌’’ లీడర్‌ ఎవరు?
గోయెంకా ట్వీట్‌లో పేర్కొన్న ‘‘ఆరెంజ్‌ టింటెడ్‌’’ లీడర్‌ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ను చాలా మంది సూచిస్తున్నారు. ట్రంప్‌ గుర్తించదగిన ఆరెంజ్‌ రంగు జుట్టు ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది. మరోవైపు ట్రంప్‌ ఇటీవలి కాలంలో భారత్‌తో కావాలని గొడవలు పెట్టుకుంటున్నారు. భారత్‌తో పెట్టుకుని బాగుపడిన దేశాలు లేవు. శ్రీలంక, పాకిస్తాన్, కెనడా, మాల్దీవులు, నేపాల్‌.. ఇలా అనేక దేశాలు భారత్‌ను దూరం చేసుకుని బాధపడుతున్నాయి. ఇప్పుడు అమెరికాకు కూడా ట్రంప్‌ పూపంలో ముప్పు పొంచి ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. సూర్యగ్రహణం (మార్చి 29, 2026న జరగనుంది) రాజకీయ నాయకుల పతనానికి కారణమవుతుందనే ఊహాగానం శాస్త్రీయంగా నిరూపితం కాదు. కానీ, సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular