https://oktelugu.com/

బ్రహ్మం గారు చెప్పింది మరోసారి నిజమైంది.. ఏంటంటే?

ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వింతలు, విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన వింతలు సైతం ప్రస్తుతం చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం. దీంతో బ్రహ్మం గారు చెప్పిన విషయాల గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ సంవత్సరం బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన అనేక విషయాలు జరిగాయి ఒక రోగంతో చాలామంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పిన విధంగానే కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 21, 2020 / 06:28 PM IST
    Follow us on

    ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వింతలు, విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన వింతలు సైతం ప్రస్తుతం చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం. దీంతో బ్రహ్మం గారు చెప్పిన విషయాల గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ సంవత్సరం బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన అనేక విషయాలు జరిగాయి ఒక రోగంతో చాలామంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు.

    బ్రహ్మంగారు చెప్పిన విధంగానే కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ 8 నెలల నుంచి వ్యాప్తి చెందుతున్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ కట్టడి సాధ్యమో కాదో తెలిసే అవకాశం ఉంది. తాజాగా బ్రహ్మం గారు చెప్పిన బంగారు తాబేలు గురించి చర్చ జరుగుతోంది.

    నేపాల్ లో తాజాగా వెలుగులోకి వచ్చిన బంగారు తాబేలు గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. నేపాల్ దేశంలో బంగారు వర్ణంలో ఉన్న తాబేలును అక్కడి ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారు. స్వర్ణ వర్ణంలో ఉన్న తాబేలు చూడటానికి ఎంతో ముచ్చట గొలుపుతోంది. భక్తులు తాబేలు దైవ సృష్టి అని చెబుతుండగా వైద్యులు మాత్రం జన్యుపరమైన కారణాల వల్ల తాబేలు బంగారు రంగులో పుట్టినట్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి తాబేళ్లు ఐదు ఉన్నాయని సమాచారం.