https://oktelugu.com/

నానికి షాక్‌.. రిలీజ్‌కు ముందే ‘వి’ కథ లీక్‌!

నేచురల్‌ స్టార్ నానికి ఇప్పుడు ఏదీ కలిసి రావడం లేదు. తనను హీరోగా పరిచయం చేసిన మోహన కృష్ణ ఇంద్రగంటితో తన 25వ సినిమా చేశాడు. తొలిసారి ఈ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించాడు. షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది. ఔట్‌పుట్‌ కూడా బాగా వచ్చిందని టాక్‌. దాంతో 25వ మూవీని ప్రత్యేకంగా మార్చుకోవడంతో పాటు ఇంద్రగంటితో హ్యాట్రిక్‌ హిట్‌ కొడతానని నాని కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. వేసవి స్పెషల్‌గా రిలీజ్‌కు అంతా సిద్ధం చేసుకున్న టైమ్‌లో కరోనా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 21, 2020 / 06:37 PM IST
    Follow us on


    నేచురల్‌ స్టార్ నానికి ఇప్పుడు ఏదీ కలిసి రావడం లేదు. తనను హీరోగా పరిచయం చేసిన మోహన కృష్ణ ఇంద్రగంటితో తన 25వ సినిమా చేశాడు. తొలిసారి ఈ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించాడు. షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది. ఔట్‌పుట్‌ కూడా బాగా వచ్చిందని టాక్‌. దాంతో 25వ మూవీని ప్రత్యేకంగా మార్చుకోవడంతో పాటు ఇంద్రగంటితో హ్యాట్రిక్‌ హిట్‌ కొడతానని నాని కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. వేసవి స్పెషల్‌గా రిలీజ్‌కు అంతా సిద్ధం చేసుకున్న టైమ్‌లో కరోనా దెబ్బకు ప్లాన్స్‌ అన్నీ మారిపోయాయి. లాక్‌డౌన్‌ ముగిశాక అయినా రిలీజ్‌ చేద్దామని అనుకుంటే థియేటర్లు మూత పడ్డాయి. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో చేసేదేమీ లేక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌ చేయాల్సి వస్తోంది. వచ్చే నెల 5వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజ్‌ కానుంది. తన 25వ చిత్రాన్ని థియేటర్లోనే చూపించాలని అనుకున్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నాని వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇష్టం లేకున్నా ఓటీటీకి ఒప్పుకున్నా అతనికి అంతలోనే షాక్‌ తగిలింది.

    Also Read: పూజా హెగ్డేకి 2 కోట్లు కావాలట !

    మరో 15 రోజుల్ల విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా కథ లీకైంది. ఈ మేరకు ‘వి’ కథ ఇదేనంటూ సోషల్‌ మీడియాలో ఓ స్టోరీ హల్‌చల్‌ చేస్తోంది. దాని ప్రకారం ఈ సినిమాలో నాని, అదితి రావు భార్యభర్తలు. అయితే, కొందరు వ్యక్తులు అదితిని దారుణంగా హత్య చేస్తారు. అప్పటి నుంచి తన భార్యను చంపిన వాళ్లను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు నాని. ఈ ప్రతీకారంలో భాగంగా కొందరిని వరుస పెట్టి చంపుతూ ప్రతి హత్య దగ్గర ‘వి’ అనే లెటర్ను విడిచి పెట్టి వెళ్తాడు. ఈ హత్యల వెనకున్న మిస్టరీని ఛేదించే పోలీస్‌ ఆఫీసర్ గా సుధీర్ బాబు రంగంలోకి దిగుతాడు. తనను పట్టుకునేందుకు సుధీర్ వేసే ఎత్తులన్నింటినీ నాని తిప్పికొడుతుంటాడు. అదితి రావును చంపింది ఎవరు? నాని ‘వి’ మార్క్‌ను ఎందుకు వదిలి వెళ్తాడు? సుధీర్ బాబు అతడిని పట్టుకున్నాడా లేదా? అనేది మిగతా స్టోరీ. ఇలా అనేక ట్విస్టులు ఉండే సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని యూనిట్‌ భావిస్తోంది. నాని నిజంగానే విలనా? అన్నది కూడా ఆసక్తి కలిగిస్తుందట. ఈ సినిమాలో నివేదా థామస్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించింది.

    Also Read: ముప్పై దాటాక గాని అర్ధం కాలేదు !

    రిలీజ్‌కు ముందే కొంత స్టోరీ లీకవడం నానితో పాటు చిత్ర యూనిట్‌కు తలనొప్పే అయినా.. అసలు కథ మాత్రం సెప్టెంబర్ ఐదో తేదీనే తెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారని సమాచారం. మరోవైపు స్టోరీ లీక్‌ అనేది చిత్ర బృందం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్‌ అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కొన్ని నెలలుగా ల్యాబ్‌లో మగ్గిన ఈ సినిమా రిలీజ్‌ ముందు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.