Harassing Woman Kondapur: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. విచక్షణా రహితంగా ఓ యువతిపై దాడి, లైంగిక యత్నం చేసిన ఘటన కలకలం సృష్టించింది. మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా అవి పని చేయడం లేదు. అయిన వారికి అందలాలు ఎక్కిస్తున్నాయి. కాని వారికి మాత్రం కటకటాలే. ఈ నేపథ్యంలో సాటి మహిళ అని చూడకుండా దాడి చేయించడం సంచలనం కలిగించింది. ఏకంగా నలుగురు యువకులతో పథకం ప్రకారం ఆమెపై చిత్రహింసలకు గురిచేయడం వివాదాస్పదంగా మారింది. చట్టాలున్నా అవి పని చేయడం లేదు. ఫలితంగా ఇలాంటి ఘటనలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

కొండాపూర్ లో నివాసం ఉండే శ్రీకాంత్, బాధితురాలు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది. ఇద్దరు సివిల్స్ కు ప్రిపేర్ అవుతుండటంతో ఇద్దరి మధ్య స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గాయత్రికి ఆరోగ్యం బాగా లేక కొద్ది రోజులు వారి పుట్టింటికి వెళ్లింది. దీంతో శ్రీకాంత్, యువతి మధ్య ఏదో వివాహేతర సంబంధం కొనసాగినట్లు వాపోయింది. దీంతో ఏప్రిల్ 24 గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇటీవల కేసును ఉపసంహరించుకుంది.
Also Read: Nagababu Pawan Kalyan : పవన్ కళ్యాణ్ స్థానంలో రంగంలోకి నాగబాబు
ఈ సందర్భంలో మాట్లాడాలని చెప్పి బాధితురాలి కుటుంబసభ్యులను ఇంటికి రమ్మని చెప్పింది. దీంతో వారు గాయత్రి ఇంటికి చేరుకోవడంతో బాధితురాలిని ఒక రూంలోకి తీసుకెళ్లింది. అక్కడే కాపు కాచి ఉన్న నలుగురు యువకులు ఆమెపై దాడికి ప్రయత్నించారు. లైంగిక దాడికి దిగారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించి తరువాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితురాలు బెదిరించింది. కర్కశంగా నడిబొడ్డున ఉన్న నగరంలో ఇలాంటి అమానవీయ సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. బాధితురాలిని అన్ని విధాలుగా భయపెడుడుతూ దాడికి పాల్పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. జరిగిన దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని చెబుతున్నారు. చట్టపరంగా వారిపై శిక్షలు పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.
Also Read:Husband And Wife Relation: భార్యాభర్తల బంధం బలంగా కొనసాగాలంటే ఏం చేయాలి?