Bandla Ganesh Ali Viral Video: సినిమా ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం ఇక్కడ ఏ రోజు ఎవ్వరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో చెప్పడం కష్టం. కారణం ఏంటి అంటే ఒక సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు టాప్ లెవెల్ కి వెళ్తారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు డౌన్ ఫాల్ ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది…అందుకే సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి కెరియర్ ఎప్పటి వరకు ఉంటుందనేది ఎవరు క్లారిటి ఇవ్వలేరు. ఇక ఇలాంటి క్రమంలోనే శివాజీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయి మళ్లీ రీఎంట్రీ ఇచ్చి 90స్ బయోపిక్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అంటూ ఒక సినిమానైతే చేస్తున్నాడు. ఈ సినిమా ఈనెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో భాగంగానే సినిమా యూనిట్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అలీ, బండ్ల గణేష్ లాంటి సీనియర్ నటులు వచ్చారు.
ఇక ఆ ఈవెంట్లో బండ్ల గణేష్ ని పట్టుకొని ఆలీ నీకు ఎవరి పేరు చెబితే ఊపొస్తుంది అని అడిగాడు. ఇక దానికి ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ పేరు వింటే వస్తుందా? చంద్రబాబు నాయుడు పేరు వింటే వస్తుందా? రేవంత్ రెడ్డి నా? చెప్పు అని అడగగా బండ్ల గణేష్ ఎక్కడ తడబడకుండా ఆ క్వశ్చన్ నువ్వు అడగాల్సింది కాదన్నా అన్నాడు.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి దేవిశ్రీ ప్రసాద్ వాకౌట్..? కొత్తగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి బాధ్యతలు!
అలాగే బండ్ల గణేష్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎవరైతే కారణమో ఆ వ్యక్తిని చనిపోయేంత వరకు గుర్తు పెట్టుకుంటాడు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్ ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి పవన్ కళ్యాణ్ మాత్రమే కారణమని ఆయన వల్లే నేను ఇక్కడ ఉన్నానని చెప్పాడు.
పవన్ కళ్యాణ్ పేరు వింటే ఊపు వస్తుంది అని చెప్పడం విశేషం… దాంతో ఆలీ సైతం ఓకే అన్నట్టుగా తలువుపాడు. గతంలో పవన్ కళ్యాణ్, అలీ ప్రాణ స్నేహితులనే విషయం మనందరికి తెలిసిందే. కానీ ఆలీ మాత్రం పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీని కాదని వైసీపీ పార్టీలో చేరడంతో వీళ్లిద్దరి మధ్య కొన్ని విభేదాలైతే వచ్చాయి. ప్రస్తుతం ఇద్దరు మాట్లాడుకోవడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…
Naaku Naa Hero power star #PawanKalyan peru vinte oopostundi. Ippudu anubhavistundi antha aayana valle
– #BandlaGanesh at #SampradayiniSuppiniSuddapoosani pre release event pic.twitter.com/DslanZ1Zw7
— BA Raju’s Team (@baraju_SuperHit) March 3, 2026