Singeetam Srinivasa Rao: తెలుగు చిత్రసీమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. సీనియర్ లెజెండ్రీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సతీమణి లక్ష్మీ కళ్యాణి ఇక లేరు. లక్ష్మీ కళ్యాణి గారు గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె శనివారం రాత్రి 9 గంటల 10 నిమిషాలకు కన్నుమూశారు. తన భార్య తనను విడిచి వెళ్లిపోవడంతో సింగీతం శ్రీనివాసరావు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ‘నా భార్య లక్ష్మీ కళ్యాణి శనివారం రాత్రి 9గం10 నిమిషాలకు తుది శ్వాస విడిచింది. 62 ఏళ్ల మా సుదీర్ఘ భాగస్వామ్యానికి ముగింపు పడింది’ అని సింగీతం మెసేజ్ చేశారు. 1960లో సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీ కళ్యాణి వివాహం చేసుకున్నారు. లక్ష్మీ కళ్యాణి గారు ఎప్పుడు సింగీతం శ్రీనివాసరావు గారికి సపోర్ట్ గా ఉండేవారు.
Also Read: Nagababu Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి నాగబాబు
ముఖ్యంగా సింగీతం శ్రీనివాసరావుకి ఆమె స్క్రిప్ట్ రాయటంలో బాగా సాయం చేసేవారు. సింగీతం శ్రీనివాసరావు సినిమా కథల్లో ఆమె పాత్ర కూడా ఎంతో ఉండేది. పైగా లక్ష్మీ కళ్యాణి ‘శ్రీకళ్యాణీయం’ అనే పుస్తకాన్నికూడా రాశారు. తన సతీమణి గురించి సింగీతం చాలా గొప్పగా చెబుతూ ఉండేవారు. అలాంటి ఆమె తుదిశ్వాస విడవడం ఆయనతో పాటు సన్నిహితులను తీవ్రంగా కలిచివేసింది.
ఆమె మృతి పట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వయసు రీత్యా సింగీతం ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నా.. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ప్రాజెక్ట్ కె చిత్రానికి కన్సల్టెంట్‌గా ఉన్నారు.
మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున లక్ష్మీ కళ్యాణి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read:Husband And Wife Relation: భార్యాభర్తల బంధం బలంగా కొనసాగాలంటే ఏం చేయాలి?