Allu Arjun shocking statement: ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తనకెవరు పోటీ లేరు అనేంత రేంజ్ లో ముందుకు సాగుతున్నాడు. ఇప్పటి వరకు పాన్ ఇండియాలో ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ ను దక్కించుకున్న తెలుగు నటుడు కూడా తనే కావడం విశేషం…ఇక తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఎవ్వరికి ఒక్కసారి కూడా నేషనల్ అవార్డ్ రాలేదు. ఆ ఘనతను అందుకున్న మొదటి తెలుగు హీరో కూడా తననే కావడం విశేషం… ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు… గతంలో ఆయన చేసిన ఒక సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడే తనకు ఫ్లాప్ అవుతుందని అనిపించిందట. అయినా కూడా ఆ సినిమాని కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాని పూర్తి చేసినట్టుగా చెప్పాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘వరుడు’ మూవీ కావడం విశేషం…
ఈ సినిమాని ‘ఒక్కడు’ రేంజ్ లో తీస్తాడని అల్లు అర్జున్ అనుకున్నాడట. కానీ గుణశేఖర్ మాత్రం దానికి భిన్నంగా తీశాడని అందువల్లే సినిమా ప్లాప్ అయిందంటూ అల్లు అర్జున్ గతంలో కొన్ని కామెంట్స్ చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఆ తర్వాత ‘రుద్రమదేవి’ సినిమా వచ్చింది.
Also Read: పవన్ కళ్యాణ్ పేరు చెప్పి అలీ కి షాక్ ఇచ్చిన బండ్ల గణేష్…బండ్లన్న తో మామూలుగా ఉండదు…వైరల్ వీడియో…
ఈ సినిమాలో అనుష్క మెయిన్ లీడ్ లో నటించినప్పటికి అల్లు అర్జున్ గోన గన్నా రెడ్డి అనే ఒక సెపరేట్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు… ‘పుష్ప 2’ సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన 1800 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడం అనేది మామూలు విషయం కాదు.
ఇప్పుడు రాబోతున్న సినిమాలతో 2000 కోట్ల మార్పును ఈజీగా దాటుతాను అంటూ తన అభిమానుల్లో ఒక కాన్ఫిడెంట్ ను నింపుతున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థాయిని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…