Homeబిజినెస్OPPO Find N6 price in India: OPPO నుంచి సంచలన మొబైల్.. ధర తెలిస్తే...

OPPO Find N6 price in India: OPPO నుంచి సంచలన మొబైల్.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది..

OPPO Find N6 price in India: ప్రపంచవ్యాప్తంగా OPPO మొబైల్ స్కూల్ ప్రత్యేకంగా గుర్తింపు ఉంది.. ఈ కంపెనీ నుంచి ఒక్కో సిరీస్ మార్కెట్లోకి వస్తుందంటే దాని గురించి వెంటనే తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల OPPO Find N6 మొబైల్ గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందని ప్రకటించినప్పటికీ.. త్వరలో స్పెయిన్ లో దీని ప్రదర్శన ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడ జరిగే వరల్డ్ కాంగ్రెస్ లో ఈ మొబైల్ గురించి ప్రస్తావించనున్నారు. అయితే దీని గురించి ఇప్పటికే లీకులు బయటకు వచ్చాయి. ఈ ఫోన్ ఎలా ఉంటుందో ఇప్పుడే అంచనా వేస్తున్నారు. వీటి ప్రకారం డిజైన్, స్పెసిఫికేషను విషయంలో కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

OPPO Find N6 మొబైల్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉంటుంది. 8.12 అంగుళాలతో పెద్ద స్క్రీన్తో దీనిని చూడవచ్చు. ఈ డిస్ప్లే ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ OS తో పనిచేస్తుంది. మూవీస్ చూడాలనుకునే వారు డెస్క్ టాప్ వలె పెద్ద స్క్రీన్ పై చూడవచ్చు. అలాగే గేమింగ్ కోరుకునే వారికి కూడా ఇది అద్భుతమైన డిస్ప్లేను అందిస్తుంది. ఇలాంటి వాతావరణం లోనైనా బ్రైట్నెస్ కోల్పోకుండా ఉంటుంది. ఈ మొబైల్లో 16 జిబి రామ్ ఉండనుంది. అలాగే 1టిబి వరకు స్పేస్ ఉండడంతో కావాల్సిన ఫైల్స్ ను స్టోర్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి అనేక రకాల యాప్స్ స్టోర్ చేసుకోవడానికి ఈ స్టోరేజ్ బాగా ఉపయోగపడుతుంది.

Also Read: Xiaomi 18,18 pro పై లీకులు.. అంచనాలు ఈ విధంగా ఉన్నాయి..

అలాగే ఇది ఫోల్డబుల్ మొబైల్ అయినందున దీని నుంచి ఫోటోలు తీసుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అందుకు అనుకూలంగా ఇందులో 200 MP మెయిన్ కెమెరాను అమర్చారు.50 MP ఆల్ట్రా వైడ్ సెన్సార్ కెమెరా పనిచేయనుంది.20 MP సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం ఉపయోగపడుతుంది. నేటి కాలంలో ఎక్కువగా కెమెరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఈ కెమెరా ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది.

ఇక రోజువారి వినియోగదారులతో పాటు.. ప్రత్యేకంగా మొబైల్ పై వర్క్ చేసే వారికి బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా అవసరం ఉంటుంది. అందుకు అనుగుణంగా ఇందులో 6000 mAh బ్యాటరీని చేర్చారు. ఇది సిలికాన్ కార్బన్ తో తయారు చేయబడింది. ఈ బ్యాటరీ 80 W వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. అలాగే 50 W వైర్లెస్ చార్జింగ్ కు సపోర్ట్ గా ఉంటుంది. వేగంగా చార్జింగ్ కావాలని అనుకునే వారికి ఈ బ్యాటరీ ఉపయోగపడుతుంది. ఈ మొబైల్ మార్కెట్లోకి వస్తే దీనిని రూ.1,10,000 లక్షలతో విక్రయించనున్నారు. లగ్జరీ లెవెల్ లో మొబైల్ యూస్ చేసే వారికి ఇందులో ఆకట్టుకునే ఫీచర్లు ఉండనున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version