NTR vs HCA : ఆర్ఆర్ఆర్ హీరోల ఫ్యాన్ వార్… హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సంచలన ట్వీట్!

NTR vs HCA : ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానుల ఆధిపత్యపోరు హాలీవుడ్ కి చేరింది. చెప్పాలంటే ఇది అవమానకర పరిణామం. ఒక ప్రక్క ఇండియన్ మూవీ ప్రపంచ స్థాయిలో కీర్తి ఆర్జిస్తుంటే.. అభిమానులు మాత్రం చిల్లర గొడవలకు దిగుతున్నారు. మనలో ఒకడి విజయం మనందరి విజయంగా భావించలేకపోతున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకకు రామ్ చరణ్ మాత్రమే హాజరు కావడాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్పుబట్టారు. ఏకంగా HCA అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ట్యాగ్ చేస్తూ […]

Written By: NARESH, Updated On : March 3, 2023 5:43 pm
Follow us on

NTR vs HCA : ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానుల ఆధిపత్యపోరు హాలీవుడ్ కి చేరింది. చెప్పాలంటే ఇది అవమానకర పరిణామం. ఒక ప్రక్క ఇండియన్ మూవీ ప్రపంచ స్థాయిలో కీర్తి ఆర్జిస్తుంటే.. అభిమానులు మాత్రం చిల్లర గొడవలకు దిగుతున్నారు. మనలో ఒకడి విజయం మనందరి విజయంగా భావించలేకపోతున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకకు రామ్ చరణ్ మాత్రమే హాజరు కావడాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్పుబట్టారు. ఏకంగా HCA అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ట్యాగ్ చేస్తూ హేట్ కామెంట్స్ చేశారు. దీంతో HCA స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

మేము ఎన్టీఆర్ ని కూడా ఆహ్వానించాము. ఆయన బిజీగా ఉండి రాలేకపోయారు. ఆయన అవార్డు త్వరలో అందిస్తాము, అంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ తో పాటు అలియా భట్ కి ఎంపిక చేసిన అవార్డు నెక్స్ట్ వీక్ వారికి చేరేలా చేస్తామని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కాగా ఓ నెటిజన్… HCA అవార్డ్స్ అందుకునే చివరి భారతీయ చిత్రం ఆర్ ఆర్ ఆర్ కావచ్చు. అనవసరంగా ఒక ఫ్యాన్ గ్రూప్ బెదిరింపులకు దిగుతున్నారు. ఈసారైనా ఎన్టీఆర్ అభిమానులు రిక్వెస్ట్ చేయకుండానే అవార్డు అందుకుంటాడని ఆశిస్తున్నా… అని ట్వీట్ చేశాడు.

సదరు ట్వీట్ కి HCA నేరుగా స్పందించింది. ఆయన అవార్డ్స్ అందుకుంటూనే ఉంటారు. కాకపోతే ఈసారి ఎన్టీఆర్ వ్యక్తిగతంగా వచ్చి అవార్డు తీసుకోలేయకపోయారు, అని రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్-రామ్ చరణ్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు కామెంట్స్ దాడి చేసుకుంటున్నారు. అంతర్జాతీయ అవార్డుల సంస్థలను కూడా ట్యాగ్ చేసి బ్లేమ్ చేయడం దారుణ పరిణామం.

HCA లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు నెటిజన్స్ కి సమాధానం చెప్పుకోవాల్సి రావడం సిగ్గుపడాల్సిన విషయం. ఇకనైనా ఈ బ్లేమ్ గేమ్ ఆపేస్తే బెటర్. ఇండియన్ సినిమా ఆస్కార్ వరకు వెళ్లినా మన స్టార్ హీరోల ఫ్యాన్స్ ఇంకా గల్లీ రేంజ్ లోనే ఆలోచిస్తున్నారు. కాగా ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ రాబట్టింది. మార్చి 12న ఆస్కార్ వేడుక జరగనుంది. ఈ వేడుకలో ఆర్ ఆర్ ఆర్ హీరోలిద్దరూ పాల్గొననున్నారు. ఆ వేదికపై దక్కే మర్యాదల విషయంలో కూడా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ గొడవలు పడటం ఖాయం.