NTR: నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్…ఆయన చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోగా మారాడు. ప్రస్తుతం ఆయన టైర్ వన్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్నాడు. తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ప్రేక్షకులందరి హృదయాలను కొలగొట్టిన ఆయన ఆ తర్వాత చేసిన దేవర సినిమాతో కొంతవరకు తన సత్తా చాటుకున్నాడు. గత సంవత్సరం హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ‘వార్ 2’ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడ్డాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు రాబోయే సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను డబ్బుడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో చాలా హిట్ సినిమాలను రిజెక్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే… నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఆ దర్శకుడు చెప్పిన రెండు కథలను రిజెక్ట్ చేశాడు. అవి చేసి ఉంటే అతనికి భారీ క్రేజ్ దక్కేది. కానీ అనవసరంగా ఆ రెండు కథలు రిజెక్ట్ చేశాడు. ఇంతకి ఆ రెండు కథలను చెప్పిన దర్శకుడు ఎవరంటే కొరటాల శివ కావడం విశేషం…
కెరియర్ స్టార్టింగ్ లో కొరటాల శివకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు మిర్చి మూవీ కథని మొదట జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పాడట. కానీ ఎన్టీఆర్ మాత్రం అప్పుడు కొన్ని వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆ కథను రిజెక్ట్ చేశాడు.
దాంతోపాటుగా కొరటాల శివ కొత్త డైరెక్టర్ కావడంతో అతన్ని పెద్దగా నమ్మలేదనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత మహేష్ బాబు చేసిన ‘శ్రీమంతుడు’ సినిమా కథను కూడా తనకు చెప్పారట. అయినప్పటికి ఎన్టీఆర్ కి ఆ సినిమా కథ మీద కూడా పెద్దగా నమ్మకం లేకపోవడంతో దాన్ని కూడా రిజెక్ట్ చేశాడు. ఇక మూడోసారి జనతా గ్యారేజ్ సినిమా కథను చెప్పినప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను తప్పకుండా మనం చేద్దామని కొరటాల శివతో చెప్పాడట.
ఫైనల్ గా ఆ సినిమాను చేసి సక్సెస్ ని సాధించాడు. నిజానికి మిర్చి, శ్రీమంతుడు లాంటి సినిమాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ కి చాలా బాగా సెట్ అయ్యేవి. కానీ అతను ఆ సినిమాలను చేయలేదు. అవి కనక ఆయన చేసి ఉంటే ఇప్పుడు ఆయన టాప్ పొజిషన్ కి వెళ్లే అవకాశాలైతే ఉండేవి…
