Homeజాతీయ వార్తలుMLC Kavitha- ED Investigation: ఈడీ విచారణకు కవిత డుమ్మా.. అరెస్ట్ తప్పించుకోవడానికేనా?

MLC Kavitha- ED Investigation: ఈడీ విచారణకు కవిత డుమ్మా.. అరెస్ట్ తప్పించుకోవడానికేనా?

MLC Kavitha- ED Investigation
MLC Kavitha- ED Investigation

MLC Kavitha- ED Investigation: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల విచారణకు ఈరోజు గైర్హాజరయ్యారు. దీంతో అరెస్ట్ తప్పించుకోవడానికే కవిత డుమ్మా కొట్టారా? అన్న ప్రచారం సాగుతోంది. .. ఈ కేసులో మార్చి 11వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 9 గంటల పాటు ప్రశ్నించారు. గురువారం మరోసారి విచారణకు హాజరుకావాలని కవితకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 11:30 నుంచి కవిత ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి  కవిత రాలేదు. చివరి నిమిషంలో రాలేనని మెయిల్ చేసి లేఖ పంపారు.. మరోవైపు బుధవారం ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబులను ముఖాముఖిగా కూర్చోబెట్టి, ఒకరు చెప్పిన సాక్షాలను మరొకతో దృవీకరింపజేసినట్టు సమాచారం. గతంలో కవిత తరఫున తాను బినామీగా వ్యవహరించినట్టు ఇచ్చిన బహుమానాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వాలని అరుణ్ కోర్టులో పిటిషన్ వేసినందున.. ఆయన తప్పించుకోలేని విధంగా బుచ్చిబాబు ఇచ్చిన సాక్షాలతో ధ్రువీకరించేందుకు ఈడీ ప్రయత్నించింది. ఈ క్రమంలో కవిత విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.

అరుణ్ రామచంద్ర పిళ్లై తో తనకు సంబంధం లేదని కవిత చెప్పినప్పటికీ.. వారిద్దరిని ముఖాముఖి ప్రశ్నించి వాస్తవాలు రాబట్టేందుకు ఈడి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఈ దఫా ఆమెను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. మనీష్ సిసోడియా కస్టడీ ఈనెల 17న, అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ గురువారంతో ముగుస్తున్నందున మద్యం కుంభకోణంలో కవిత పాత్రను తేల్చేందుకు ఈడి ప్రయత్నించవచ్చని సమాచారం. ఈ పరిణామాలను ఊహించినందు వల్లే కవితా బుధవారం సుప్రీంకోర్టు తలుపు తట్టి తనపై ఈడి విచారణను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడు ఆమె పిటిషన్ ను వెంటనే విచారించేందుకు అంగీకరించకపోవడం, స్టే కు నిరాకరించడంతో ఆమె ప్రయత్నాలకు విఘాతం కలిగినట్లు అయింది. దీంతో ఈ విషయం చాలా సీరియస్ గా మారే అవకాశం ఉందని, గురువారం కవిత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

MLC Kavitha- ED Investigation
MLC Kavitha- ED Investigation

కాగా, గతవారం మహిళా రిజర్వేషన్ పేరుతో ధర్నా నిర్వహించి పార్టీ కార్యకర్తలను సమీకరించిన కవిత ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరించారు. బుధవారం ఢిల్లీలోని మెరీడియన్ హోటల్లో మహిళా రిజర్వేషన్ పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కవితకు సంఘీభావంగా మళ్ళీ ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ చేరుకున్నారు. ఒకవేళ కవితను అరెస్టు చేస్తే వెంటనే రాజకీయ కార్యాచరణకు వారు సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. అయితే కవితను గురువారమే అరెస్టు చేస్తారా, మరోసారి పిలిపించిన తర్వాత అరెస్టు చేస్తారా? అనే విషయంపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఢిల్లీలోని పెద్దలతో కొందరు మధ్య భక్తుల ద్వారా మాట్లాడించి పరిస్థితి మరింత విషమించకుండా చూసుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని, అంతా సవ్యంగా జరిగితే అరెస్టు ఉండకపోవచ్చని చర్చ కూడా జరుగుతున్నది.

గతవారం కవితపై ఈడి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రధానంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో మీ పాత్ర ఏమిటి? మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై మీకు బినామీయేనా? ఇండో స్పిరిట్స్ లో 32.5% వాటాలతో పాటు ఫెర్నార్డ్ రికార్డు పంపిణీదారుగా కూడా ఉన్నారా? సౌత్ గ్రూప్లో వాటా ఎంత? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? హవాలా ద్వారా ఢిల్లీకి పంపిన డబ్బులు ఎవరివి? ఢిల్లీ ఒబెరాయ్ హోటల్లో మద్యం వ్యాపారులు, ఆప్ నేతలతో సమావేశం అయ్యారా? అక్కడ సిసోడియా, విజయ్ నాయర్ లను కలుసుకున్నారా? పంజాబ్, గోవా ఎన్నికల్లో ఆప్ కు నిధులు అందించారా? ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రును కలుసుకున్నారా లేదా? దాదాపు పది ఐఫోన్లను ఎందుకు మార్చాల్సి వచ్చింది? వాటిని ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? ఇలాంటి అనేక ప్రశ్నలను ఈడి సంధించినట్టు తెలుస్తోంది.. కవిత వీటికి స్పష్టమైన సమాధానాలు చెప్పలేకపోవడంతో.. సరి కూడా అవే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular