Homeఎంటర్టైన్మెంట్Mad For Each Other promo controversy: భార్య భర్తల మధ్య గొడవలు పెట్టే షో..వివాదాస్పదంగా...

Mad For Each Other promo controversy: భార్య భర్తల మధ్య గొడవలు పెట్టే షో..వివాదాస్పదంగా మారిన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ ప్రోమో!

Mad For Each Other promo controversy: స్టార్ మా ఛానల్ లో ఈ నెల 15 వ తారీఖు నుండి ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ అనే రియాలిటీ షో ప్రారంభం కాబోతుంది. ఇదొక బిగ్ బాస్ తరహా షో అని చెప్పొచ్చు. ఈ షో లో పెళ్ళైన జంటలు , పెళ్లి కాబోయే జంటలు , రిలేషన్ షిప్ లో ఉండే జంటలు పాల్గొనబోతున్నాయి. ఈ జంటల మధ్య జరిగే సంఘటనలు , సందర్భాలను […]

Mad For Each Other promo controversy: స్టార్ మా ఛానల్ లో ఈ నెల 15 వ తారీఖు నుండి ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ అనే రియాలిటీ షో ప్రారంభం కాబోతుంది. ఇదొక బిగ్ బాస్ తరహా షో అని చెప్పొచ్చు. ఈ షో లో పెళ్ళైన జంటలు , పెళ్లి కాబోయే జంటలు , రిలేషన్ షిప్ లో ఉండే జంటలు పాల్గొనబోతున్నాయి. ఈ జంటల మధ్య జరిగే సంఘటనలు , సందర్భాలను బట్టీ వీళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉంది అనేది బయట పడుతుంది అన్నమాట. ఈ షోకి హోస్ట్ గా శ్రీముఖి వ్యవహరించనుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి , సీనియర్ హీరోయిన్స్ లయ, రాధ వంటి వారు ఈ షో కి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ తరహాలోనే ప్రతీ వారం ఈ షోలో కూడా ఎలిమినేషన్స్ ఉంటాయి. చివరి వరకు ఈ షోలో మిగిలిన జంటకు 50 లక్షల రూపాయిల ప్రైజ్ మనీ ఇస్తారు.

ఇకపోతే రీసెంట్ గానే ఈ షోకి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమో ని చూసిన నెటిజెన్స్ ‘ఇదేమి షో రా బాబు.. పచ్చని సంసారాల్లో నిప్పులు పొసే షో లాగా ఉంది ఇది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిన్న రాత్రి విడుదల చేసిన ఈ ప్రోమో లో వాసంతి కృష్ణన్ , పవన్ కళ్యాణ్ జంట మధ్య విబేధాలు వచ్చాయి. పాపం వాసంతి మూలాన కూర్చొని ఏడుస్తూ ఉంది. మరో పక్క మాస్క్ మ్యాన్ హరీష్ తన భార్య హరిత ని మూలకి వెళ్లి కూర్చో అంటూ కోపం గా మాట్లాడడం కూడా హైలైట్స్ లో ఒకటి. అదే విధంగా రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న మహేష్ బాబు , సాండ్రా జంట కూడా గొడవలు పడ్డారు. మనిద్దరి మధ్య ర్యాపో ఉండాలి అని మహేష్ బాబు అనడం, అలా కాదు నాన్న అంటూ సాండ్రా అతన్ని బ్రతిమిలాడడం వంటివి ఈ ప్రోమో లో చూడొచ్చు .

Also Read: అక్కినేని నాగ చైతన్య కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఆందోళనకు గురి చేస్తున్న వీడియో!

కేవలం జంటల మధ్య గొడవలు మాత్రమే కాదు , రెండు జంటల మధ్య కూడా పెద్ద గొడవలే జరిగినట్టు అనిపిస్తున్నాయి. మాస్క్ మ్యాన్ హరీష్, నటరాజ్ మాస్టర్ ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేసుకోవడాన్ని ఈ వీడియో లో మనం చూడొచ్చు. అంతే కాకుండా సోనియా సింగ్ సంధ్య తో మాట్లాడుతూ ‘అతనికి (సంధ్య భర్త) మాట్లాడే స్పేస్ ఇవ్వు ‘ అని అనడం , అందుకు సంధ్య కోపం తో ఊగిపోవడం వంటివి కూడా ఈ వీడియో లో చూడొచ్చు. చూస్తుంటే షో మొత్తం గొడవలే ఉన్నట్లుండి. మధ్యలో కొన్ని ఎమోషన్స్ కూడా ఉన్నాయి, భీభత్సమైన టాస్కులు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఈ షో ఎలా ఉండబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper