
Akkineni Akhil: టాలీవుడ్ లోని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో రాజమౌళి కుమారుడు కార్తీకేయకు శుభాకాంక్షలు తెలుపుతూ యంగ్ హీరో అఖిల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై కార్తీకేయ ఇచ్చిన రిప్లైపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అఖిల్ మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపితే కార్తీకేయ అలాంటి రిప్లై ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రత్యేకంగా పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు. ఈ విషయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు కలుగజేసుకొని ఇద్దరి మధ్య ఫ్రెండ్సిప్ ఉన్నప్పుుడు ఆ మాత్రం కామెంట్స్ ఉండవా? అని వివాదాన్ని చల్లార్చుతున్నారు. ఇంతకీ కార్తీకేయ ఎలాంటి రిప్లై ఇచ్చారు? అసలెందుకు ఈ వివాదం మొదలైంది?
ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ లభించిన విషయం తెలిసిందే. అయితే ఆస్కార్ రావడానికి రాజమౌళి కుమారుడు కార్తీకేయ ప్రత్యేకంగా కృషి చేశారని వెలుగులోకి వచ్చింది. ఆస్కార్ నామినేషన్ మొదలుకొని సినిమాను ప్రమోట్ చేయడంలో కార్తీకేయ విపరీతంగా కష్డపడ్డాడు. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ లను హాలీవుడ్ కు పరిచయం చేసి పలు ఈవెంట్లలో వారితో షో చేయించారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ సినిమాలకు వివిధ అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. చివరికి ఆస్కార్ అవార్డు కూడా సొంతమైంది.
ఈ తరుణంలో ఆర్ఆర్ఆర్ టీంకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టర్ రాజమౌళి తో పాటు హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్స్ కాలబైరవ, రాహుల్ సిప్లిగంజ్, డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ లను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అయితే ఆస్కార్ రావడానికి తెరవెనుక ఉండి విశేష కృషి చేసింది కార్తీకేయనే అని వార్తాలు రావడంతో ఆ తరువాత కార్తీకేయను ప్రత్యేకంగా అభినందించడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది కార్తీకేయను ప్రత్యేకంగా ప్రశంసించారు.

వీరిలో యువ హీరో అఖిల్ కార్తీకేయ పేరుతో అతిపెద్ద విజయం సాధించినందుకు కంగ్రాట్స్ మై బ్రదర్.. అని ట్వీట్ చేశారు. అఖిల్ చేసిన ట్వీట్ కు కార్తీకేయ ‘థ్యాంక్స్..రా..’ అని రిప్లై ఇచ్చారు. అయితే కార్తీకేయ ఇచ్చిన రిప్లైపై అక్కినేని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ మర్యాదగా బ్రో అని పిలిస్తే ఏమాత్రం మర్యాద లేకుండా ‘రా..’ అంటారా? అంటూ రీ ట్వీట్ చేశారు. కొందరు ప్రత్యేకంగా పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ఈ పరిస్థితిని గమనించిన కొందరు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కలుగజేసుకొని కార్తీకేయ, అఖిల్ మధ్య మంచి స్నేహం ఉంది. అలాగే కార్తీకేయ కంటే అఖిల్ చిన్నవాడు. అందుకే ఫ్రెండ్సిప్ లో భాగంగా ‘రా..’ అనొచ్చు. అందులో తప్పేముంది? అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అఖిల్ ఫ్యాన్స్ మాత్రం అక్కడితో ఊరుకోవడం లేదు. కార్తీకేయ పేరుతో రకరకాల పోస్టులు పెడుతున్నారు.
Thank you raa! Love you!! ❤️❤️❤️ https://t.co/InYvqCDWUi
— S S Karthikeya (@ssk1122) March 15, 2023