
David Warner- IPL: ఐపీఎల్‌కు సమయం దగ్గర పడుతోంది. మొన్నటి వరకు సన్‌రైటర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు కెప్టెన్లు ఎవరన్న ఉత్కంఠ కొనసాగింది. ఇటీవలే సారథిగా మార్క్‌రమ్‌ను టీం మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఢిల్లీ కెప్టెన్‌పై ఉత్కంఠ కొనసాగింది. ఎట్టకేలకు యాజమాన్యం కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను ఎంపిక చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్ కారణంగా మరి కొన్ని నెలల పాటు ఆటకి దూరంగా ఉండనున్నారు. దీంతో మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2023 సీజన్‌లో కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ ఢిల్లీ జట్టుని నడిపించనున్నారు. వార్నర్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి సుదీర్ఘకాలం సారథిగా పనిచేశారు. 2022లో జట్టును వీడారు.
మళ్లీ సారథ్య బాధ్యతలు..
ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి కెప్టెన్‌గా టీమ్‌ని నడిపించబోతున్నాడు. గత ఏడాది డేవిడ్ వార్నర్‌ని వేలంలో కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ.. కేవలం ఓపెనర్‌గానే ఆడించింది. అయితే.. కారు యాక్సిడెంట్ కారణంగా ఐపీఎల్ 2023 సీజన్‌కి ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ దూరం కావడంతో.. డేవిడ్ వార్నర్‌కి మేనేజ్‌మెంట్ జట్టు పగ్గాలు అప్పగించింది.
ఢిల్లీతోనే ఐపీఎల్ ప్రస్థానం..
వాస్తవానికి ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ ప్రస్థానం ఢిల్లీ జట్టుతోనే మొదలైంది. 2009లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మారాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి కెప్టెన్‌గా 2016లో టైటిల్‌ని కూడా అందించిన వార్నర్‌ని 2021లో ఆ ఫ్రాంఛైజీ ఘోరంగా అవమానించింది. అనామక ప్లేయర్ తరహాలో తుది జట్టు నుంచి కూడా తప్పించి రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టింది. ఫ్రాంఛైజీపై ఒక్క విమర్శ కూడా డేవిడ్ వార్నర్ చేయలేదు. ఇప్పటి వరకూ 162 ఐపీఎల్ మ్యచ్‌లాడిన వార్నర్ 140.69 స్ట్రైక్‌రేట్‌తో 5,881 పరుగులు చేశాడు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్ ఐదో స్థానంలో ఉన్నాడు.

అనుభవం దృష్ట్యా…
డేవిడ్ వార్నర్‌కి కెప్టెన్సీ అనుభవం ఉండటంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ.. ఐపీఎల్ 2023లో అతనికే పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించింది. అలానే వైస్ కెప్టెన్‌గా భారత జట్టు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ని ఎంపిక చేశారు. అయితే ఈమేరకు ఢిల్లీ ఫ్రాంఛైజీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తన మొదటి మ్యాచ్‌ని లక్నో సూపర్ జెయింట్స్‌తో ఏప్రిల్ 1న ఆడనుంది. ఈ మ్యాచ్‌కి లక్నో ఆతిథ్యం ఇవ్వనుంది.