Homeఎంటర్టైన్మెంట్Vrusha Karma Movie Story Copy Controversy: వృషకర్మ కథను ఆ మూవీ నుంచి కాపీ...

Vrusha Karma Movie Story Copy Controversy: వృషకర్మ కథను ఆ మూవీ నుంచి కాపీ చేశారా..? మరి ఇంత దారుణమా..?

Vrusha Karma Movie Story Copy Controversy: నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ సినిమా మీద ప్రేక్షకులకు మంచి అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ విజువల్స్ గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా విజువల్స్ చూస్తే అప్పట్లో చిరంజీవి హీరోగా వచ్చిన ‘అంజి’ సినిమా మాదిరిగానే ఉన్నాయి. ఈ సినిమా కథ కూడా అలాంటి నేపథ్యంలోనే […]

Vrusha Karma Movie Story Copy Controversy: నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ సినిమా మీద ప్రేక్షకులకు మంచి అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ విజువల్స్ గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా విజువల్స్ చూస్తే అప్పట్లో చిరంజీవి హీరోగా వచ్చిన ‘అంజి’ సినిమా మాదిరిగానే ఉన్నాయి. ఈ సినిమా కథ కూడా అలాంటి నేపథ్యంలోనే వస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఒక వ్యక్తి పూనుకున్నప్పుడు అతన్ని హీరో ఎలా అడ్డుకున్నాడు అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది. ఇక అడ్వెంచర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం… అంజి సినిమా కూడా అడ్వెంచర్ జానర్లో వచ్చింది. కాకపోతే అందులో దైవత్వానికి ముడిపెట్టారు.

Also Read: అక్కినేని నాగ చైతన్య కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఆందోళనకు గురి చేస్తున్న వీడియో!

ఇందులో కూడా దైవత్వంతో పాటు రాక్షసత్వాన్ని కూడా చూపిస్తూ ప్రేక్షకులను మైమరిపింప చేయాలనే ప్రయత్నంలో దర్శకుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. కథ సేమ్ పాటర్న్ లో నడిచినప్పటికి కొంచెం మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తుంది. అంజి నుంచే వృషకర్మ సినిమా స్టోరీని కాపీ చేసారంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి స్టార్ హీరో చేసిన అంజి సినిమా అప్పట్లో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కానీ వృషకర్మ సినిమా ఇప్పుడు ఈ ట్రెండుకు తగ్గ విజువల్స్ తో తెరకెక్కినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందంటూ అక్కినేని అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…

గత కొద్ది రోజుల నుంచి నాగచైతన్యకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు. ఆయన ఏ సినిమా చేసిన కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోతుంది. దాంతో వృషకర్మ అంటూ భారీ బడ్జెట్ తో ఈసారి ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు. అందుకే ఈ సినిమా మీద తను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper