దేశంలోని యువతలో కొంతమంది ఉద్యోగం ద్వారా డబ్బులు సంపాదించాలని భావిస్తుంటే మరి కొంతమంది మాత్రం వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుత కాలంలో వ్యాపారం చేయాలన్నా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే వ్యాపారం చేయాలని అనుకునే వాళ్లు రైల్వేస్ తో కలిసి వ్యాపారం చేస్తే సులభంగా డబ్బులను పొందే అవకాశం ఉంటుంది.
Also Read: కొత్తరకం కరోనా గురించి షాకింగ్ న్యూస్.. ఏ వ్యాక్సిన్ పని చేయదట..?
ఇండియన్ రైల్వేస్ తాజాగా గూడ్స్ షెడ్ డెవలప్‌మెంట్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. రైల్వే శాఖ గూడ్స్ షెడ్ డెవలప్‌మెంట్ పాలసీ ద్వారా ప్రైవేట్ భాగస్వాములతో కలిసి దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లకు దగ్గరలో దుకాణాలను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. రైల్వే శాఖకు దగ్గరలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా కస్టమర్లు క్యాంటీన్ లేదా టీ షాప్ పెట్టి నెలకు వేల రూపాయల ఆదాయం పొందవచ్చు.
Also Read: ‘భారత్’లో విజృంభిస్తున్న మరో వ్యాధి.. 12వేల బాతులు మృతి..?
రైల్వేస్ తో కలిసి పని చేయడం వల్ల తక్కువ సమయంలోనే కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. గూడ్స్ షెడ్ డెవలప్‌మెంట్ పాలసీ ద్వారా ఇప్పటికే రైల్వే స్టేషన్లలో షాపులు ఉన్నవాళ్లు ఆ షాపులను మరింతగా అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. క్యాంటీన్, టీ షాప్ కాకుండా ఇతర బిజినెస్ లు చేయడం ద్వారా కూడా లాభాలను పొందవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: వైరల్ వార్తలు
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశం ఉన్నవాళ్లు ఈ పాలసీలో చేరి బిజినెస్ ను ప్రారంభించి గూడ్స్ షెడ్ డెవలప్‌మెంట్ పాలసీ ప్రయోజనాలను పొందవచ్చు. మరోవైపు ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ మరియు యాప్ లలో కీలక మార్పులు చేసింది. ఈ మార్పుల వల్ల కస్టమర్లకు మరింత సులభంగా టికెట్ బుకింగ్ చేసే అవకాశం ఉండటంతో పాటు ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.