మంగళవారం కుబేర స్థానాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా?

సాధారణంగా మంగళవారం కుజునికి ప్రీతికరమైన రోజు. మంగళవారానికి అధిపతి కుజుడు అని చెబుతుంటారు. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు కారకుడు కాబట్టి మంగళవారం ఎటువంటి పనులను చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అయితే మంగళవారం శ్రీ మహాలక్ష్మికి ఆంజనేయస్వామికి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ మంగళవారం మహాలక్ష్మీని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతుంటారు. అలాగే మంగళవారం మన ఇంటి నుంచి ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు. అలా ఇవ్వడం ద్వారా సాక్షాత్తు మన ఇంటి మహాలక్ష్మిను ఇతరులకు […]

Written By: Navya, Updated On : January 5, 2021 3:57 pm
Follow us on

సాధారణంగా మంగళవారం కుజునికి ప్రీతికరమైన రోజు. మంగళవారానికి అధిపతి కుజుడు అని చెబుతుంటారు. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు కారకుడు కాబట్టి మంగళవారం ఎటువంటి పనులను చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అయితే మంగళవారం శ్రీ మహాలక్ష్మికి ఆంజనేయస్వామికి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ మంగళవారం మహాలక్ష్మీని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతుంటారు. అలాగే మంగళవారం మన ఇంటి నుంచి ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు. అలా ఇవ్వడం ద్వారా సాక్షాత్తు మన ఇంటి మహాలక్ష్మిను ఇతరులకు ఇచ్చినట్టు అవుతుంది. అయితే మహాలక్ష్మి మన ఇంట్లో తాండవం చేయాలంటే ధనానికి అధిపతి అయిన కుబేరుడిని పూజించాలి.

Also Read: శివుని కంఠం ఎందుకు నీలి రంగులో ఉంటుందో తెలుసా?

మంగళవారం ఉదయం నిద్ర లేచి కుబేర స్థానాన్ని చూడటం వల్ల మన ఇంటికి ధన ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. మన ఇంటికి ఉత్తర దిక్కున కుబేర స్థానంగా భావిస్తారు. ఉదయం లేవగానే కుబేర స్థానాన్ని చూడటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. మన ఇంటి ఉత్తరదిక్కున కుబేరుని విగ్రహాన్ని పెట్టి పూజించడం వల్ల ధనాభివృద్ధి కలుగుతుంది.అలాగే వ్యాపార రంగంలో రాణించాలనుకునే వారు కుబేరునికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది.

Also Read: తులసి మొక్కకు శాపం పెట్టిన వినాయకుడు.. కారణం ఇదే!

మంగళవారం ఉదయం నిద్ర లేచేటప్పుడు కుబేర స్థానమైన ఉత్తరదిక్కున చూసి నిద్ర లేవాలి. అలాగే రాత్రి పడుకునే సమయంలో దక్షిణం వైపు తల పెట్టుకుని పడుకోవాలి. ఈ విధంగా ఉదయం కుబేర స్థానంని చూడటం వల్ల ధనాభివృద్ధి కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం