https://oktelugu.com/

ఆ వరం టాలీవుడ్‌కి ఎప్పుడో..

కోవిడ్‌ వల్ల విధించిన లాక్‌డౌన్‌తో సినిమా థియేటర్లు ఎక్కడికక్కడ మూతపడ్డాయి. అయితే.. ఈ మధ్యే థియేటర్లు ఓపెన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించినా పెద్దగా ప్రేక్షకుల రెస్పాన్స్‌ లేదు. ఇక తమిళనాట కూడా థియేటర్లకు వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు వచ్చేశాయి. అక్కడి ప్రభుత్వం థియేటర్లు వంద శాతం ఓపెన్‌ చేసుకోవచ్చని సూచించింది. Also Read: ఇరవై ఏళ్లకే ఇద్దరు పిల్లలు.. ఆ స్టార్ హీరోయిన్ కి సలాం ! అయితే.. ఆ వరం టాలీవుడ్‌ నిర్మాతలకు ఎప్పుడు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 5, 2021 / 03:04 PM IST
    Follow us on


    కోవిడ్‌ వల్ల విధించిన లాక్‌డౌన్‌తో సినిమా థియేటర్లు ఎక్కడికక్కడ మూతపడ్డాయి. అయితే.. ఈ మధ్యే థియేటర్లు ఓపెన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించినా పెద్దగా ప్రేక్షకుల రెస్పాన్స్‌ లేదు. ఇక తమిళనాట కూడా థియేటర్లకు వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు వచ్చేశాయి. అక్కడి ప్రభుత్వం థియేటర్లు వంద శాతం ఓపెన్‌ చేసుకోవచ్చని సూచించింది.

    Also Read: ఇరవై ఏళ్లకే ఇద్దరు పిల్లలు.. ఆ స్టార్ హీరోయిన్ కి సలాం !

    అయితే.. ఆ వరం టాలీవుడ్‌ నిర్మాతలకు ఎప్పుడు అందుతుందా అని ఆసక్తిగా మారింది. ఈనెల 9 నుంచి సంక్రాంతి సీజన్‌ ప్రారంభం అవుతోంది. దానికంటే ముందే 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రావాలి. సంక్రాంతి సీజ‌న్ అయిపోయాక‌ అనుమ‌తి ఇచ్చినా లాభం లేదు. టాలీవుడ్ కీల‌క‌మైన సీజ‌న్ మిస్ చేసుకునే ప్రమాదం ఉంది.

    ఎలాగూ.. ప‌బ్బులు, క్లబ్బులు, షాపింగ్ మాళ్లూ, బార్లకు 100 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చేశారు. వాటికి లేని భ‌యాలు.. థియేట‌ర్లకు ఎందుకు..? అనేదే పెద్ద ప్రశ్న. టాలీవుడ్ ‘సో కాల్డ్’ పెద్దలు సైతం ఈ విష‌యంలో నిమ్మకు నీరెత్తిన‌ట్టు వ్యవ‌హ‌రించ‌డం బాధాక‌రం. మొన్నటి వ‌ర‌కు అటు కేసీఆర్ ద‌గ్గర‌కు, ఇటు జ‌గ‌న్ ద‌గ్గర‌కు జ‌నాలు గుంపులుగా వెళ్లారు. త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. తీరా ఇప్పుడు కీల‌క‌మైన స‌మ‌యంలో.. ‘నాకెందుకులే’ అన్నట్టు వ్యవ‌హ‌రిస్తున్నారు. సురేష్‌బాబు, అల్లు అర‌వింద్, దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత‌లు కూడా 100 శాతం ఆక్యుపెన్సీ విష‌యంలో లైట్ తీసుకోవ‌డం ఆశ్యర్యాన్ని క‌లిగిస్తోంది.

    Also Read: లెజెండరీ దర్శకుడి కోడలకి మళ్ళీ పెళ్లి !

    అయితే.. ఈ సంక్రాంతి సీజన్‌కు ‘వకీల్‌ సాబ్‌’ లాంటి సినిమా ఉంటే ఈ ప‌రిస్థితి ఉండేదా..? 100 శాతం ఆక్యుపెన్సీ కోసం అంద‌రూ పోరాడేవారు. ఇప్పుడు బ‌డా స్టార్ సినిమా ఏదీ. సంక్రాంతికి రావ‌డం లేదు. అందుకే ఇంత సైలెంటు. త‌మిళ‌నాట అలా కాదు. అక్కడ విజ‌య్ ‘మాస్టర్‌’ సంక్రాంతికి రెడీ అవుతోంది. విజ‌య్ తో పాటు.. బ‌డా హీరోలంతా.. త‌మిళ‌నాడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. 2020 ఎలాగూ భారీ న‌ష్టాల్ని మిగిల్చింద‌ని, క‌నీసం ఇప్పుడైనా కోలుకునే వీలు క‌ల్పించ‌మ‌ని మూకుమ్మడిగా అడిగారు. దీంతో అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. హీరోలంతా ఒక్క తాటిపై రావ‌డంతో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తులు వ‌చ్చాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్