Dasara Collections : ‘దసరా’ మొదటి రోజు వసూళ్లు..టాలీవుడ్ లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డ్స్ నెలకొల్పిన నాని

Dasara Collections : ప్రతీ హీరో కెరీర్ లో ఒక మైల్ స్టోన్ ఉంటుంది.అప్పటి వరకు కేవలం ఒకే లెవెల్ లో కొనసాగిన కెరీర్, కేవలం ఒకే ఒక్క హిట్ తో రేంజ్ మారిపోతూ ఉంటుంది.ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అలాంటి హిట్ తగిలింది.ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన ‘దసరా’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదలై సూపర్ హిట్ టాక్ నసొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ముందు నాని సినిమాల […]

Written By: NARESH, Updated On : March 30, 2023 9:36 pm
Follow us on

Dasara Collections : ప్రతీ హీరో కెరీర్ లో ఒక మైల్ స్టోన్ ఉంటుంది.అప్పటి వరకు కేవలం ఒకే లెవెల్ లో కొనసాగిన కెరీర్, కేవలం ఒకే ఒక్క హిట్ తో రేంజ్ మారిపోతూ ఉంటుంది.ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అలాంటి హిట్ తగిలింది.ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన ‘దసరా’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదలై సూపర్ హిట్ టాక్ నసొంతం చేసుకుంది.

ఈ చిత్రానికి ముందు నాని సినిమాల బిజినెస్ కేవలం 20 నుండి 30 కోట్ల రూపాయిల మధ్యలోనే ఉండేది.కానీ ఈ సినిమా కి ఏకంగా 50 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.అందుకు తగ్గట్టుగానే మూవీ కి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగాయి.టాక్ కూడా అద్భుతంగా రావడం తో ఓపెనింగ్స్ అమెరికా నుండి అనకాపల్లి వరకు అదిరిపోయాయి.

హీరో నాని కి మొదటి నుండి అమెరికా లో మంచి క్రేజ్ ఉంది.ఆయన సినిమాలు అక్కడ ప్రీమియర్ షోస్ నుండే అద్భుతమైన వసూళ్లు రాబడుతాయి.ఇక కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘దసరా’ సినిమాకి సుమారుగా 600K డాలర్ల వసూళ్లు కేవలం ప్రీమియర్ షోస్ నుండే వచ్చాయి.ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది.ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కూడా ఇదే పరిస్థితి, నైజాం లో సుమారుగా 7 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా, ఆంధ్ర ప్రదేశ్ లో 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసిందట.

‘శ్రీ రామ నవమి’ రోజు ఈ సినిమా విడుదల అవ్వడం పెద్ద ప్లస్ అయ్యిందనే చెప్పాలి.చాలా చోట్ల నూన్ షోస్ కంటే మ్యాటనీ షోస్ దుమ్ము లేపాయి.అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 17 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ సినిమా,ప్రపంచవ్యాప్తంగా కలిపి 25 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.