Rohit Sharma: 30 బంతుల్లో 30 పరుగులు.. అప్పుడు నా మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయింది.. రోహిత్ శర్మ సంచలన కామెంట్స్

దాదాపు 17 సంవత్సరాల తర్వాత టి20 వరల్డ్ కప్ గెలుచుకోవడంతో టీమ్ ఇండియా అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా మ్యాచ్ గెలిచిన తర్వాత రోహిత్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. మైదానం పై అలానే పడుకుని ఉన్నాడు. నాలుగైదు సార్లు గట్టిగా నాక్స్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 17, 2024 8:27 am

Rohit Sharma

Follow us on

Rohit Sharma: 2007లో ధోని సారథ్యంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత 2014లో ఫైనల్ వెళ్లినప్పటికీ శ్రీలంక చేతిలో ఓడిపోయింది. మళ్లీ 10 సంవత్సరాల తర్వాత ఫైనల్ వెళ్ళింది. వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 176 రన్స్ చేసింది. 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 169 పరుగుల వద్ద ఆగిపోయింది. క్లాసెన్ 27 బంతుల్లో 52 పరుగులు చేసి, మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఉపయోగం లేకుండా పోయింది.

చివరి ఐదు ఓవర్లు.

ఓ ఎండ్ లో క్లాసెన్, మరో ఎండ్ లో డేవిడ్ మిల్లర్ ఉండడంతో దక్షిణాఫ్రికా విజయ సమీకరణం 30 బంతులకు 30 పరుగులుగా మారింది. అప్పటికి దక్షిణాఫ్రికా జట్టు చేతిలో ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. మైదానం లోపల ఉన్న ఆటగాళ్లకు.. మ్యాచ్ చూస్తున్న అభిమానులకు భారత జట్టు విజయంపై ఏమాత్రం ఆశలు లేవు. ఈ స్థితిలో చివరి 5 ఓవర్లలో భారత బౌలర్లు, ఫీల్డర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఫలితంగా భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది. కీలక సమయాలలో భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యూహాలను అమలు చేసి దక్షిణాఫ్రికా జట్టుపై ఒత్తిడి పెంచాడు. వాస్తవానికి 15 ఓవర్ అక్షర్ పటేల్ వేశాడు. ఆ ఓవర్లో క్లాసెన్ చెలరేగిపోయాడు. ఆ సమయంలో ఏం చేయాలో రోహిత్ శర్మకు అర్థం కాలేదు..” ఒక్కసారిగా నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అటువంటి క్లిష్ట సమయంలో నేను మరో విధంగా ఆలోచించలేదు. అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం కీలకమనుకున్నాను. ప్రశాంతంగా మా ప్లాన్స్ అమలు చేయాలని భావించాను. దక్షిణాఫ్రికా విజయ్ సమీకరణం 30 బంతులకు 30 పరుగులుగా ఉన్నప్పుడు తీవ్రమైన ఒత్తిడికి గురైన మాట వాస్తవం. కానీ మా బౌలర్లు ఆ తర్వాతే 5 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దాన్నిబట్టి మేము ఎంత ప్రశాంతంగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పరాజయం చవిచూస్తామని సంకేతాలు కనిపించినప్పుడు నిరాశలో కూరుకుపోవడం సర్వసాధారణం. కాకపోతే మేము అలా నిరాశను దరి చేరనివ్వలేదు. సానుకూల దృక్పథాలను ప్రోది చేసుకోవడం ద్వారా మాది అద్భుతమైన జట్టని నిరూపించామని” రోహిత్ పేర్కొన్నాడు.

ఆ విజయంతో..

దాదాపు 17 సంవత్సరాల తర్వాత టి20 వరల్డ్ కప్ గెలుచుకోవడంతో టీమ్ ఇండియా అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా మ్యాచ్ గెలిచిన తర్వాత రోహిత్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. మైదానం పై అలానే పడుకుని ఉన్నాడు. నాలుగైదు సార్లు గట్టిగా నాక్స్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత మైదానంపై జాతీయ జెండాను పాతాడు. ఔట్ ఫీల్డ్ పై పెరిగిన గడ్డిని తిన్నాడు. ఆ మట్టిని కూడా నోట్లో వేసుకున్నాడు.. అనంతరం ఈ మైదానం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు.

హార్దిక్ అద్భుతం

ఫైనల్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ లో అద్భుతాలు చేశాడు. ప్రమాదకరమైన మిల్లర్, జాన్సన్ ను ఔట్ చేశాడు. మరీ ముఖ్యంగా మిల్లర్ కు ఫుల్ టాస్ బంతి వేయగా అతడు బలంగా కొట్టాడు.. బౌండరీ లైన్ వద్ద ఉన్న సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన రిలే క్యాచ్ పట్టి డేవిడ్ మిల్లర్ ను పెవిలియన్ పంపించాడు. చివరి ఓవర్లో పాండ్యా రెండు వికెట్లు పడగొట్టి, 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.