Headache Hacks: మనకు అప్పుడప్పుడు తలనొప్పి వస్తూనే ఉంటుంది. దీంతో మనకు ఏమీ తోచదు. తల పట్టుకుని కూర్చుంటాం. కొందరికి కాళ్ల నొప్పులు, కీళ్లనొప్పులు, ఒళ్లు నొప్పులతో పాటు తలనొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని నుంచి తప్పించుకోవడానికి ఏవేవో మందులు వేసుకుంటాం. అయినా ఫలితం ఉండదు. తలనొప్పి రావడానికి కారణాలంటే? ఎందుకు వస్తుంది? అనే విషయాలను పరిశీలిస్తే కొందరికి ఒత్తిడి, మరికొందరికి సైనస్ వల్ల, ఇంకొందరికి గ్యాస్ట్రిక్, మైగ్రేన్ తదితర కారణాలతో తలనొప్పి రావడం మామూలే. ఇంకా వాతావరణం మారనప్పుడు కూడా తలనొప్పి వస్తుంది. తలనొప్పి భరించలేనంత బాధగా అనిపిస్తుంది. దీని నివారణకు మనం ఎన్నో చర్యలు తీసుకుంటుంటాం.

తలనొప్పి కేవలం తలకే పరిమితం కాదు కన్ను, చెవి, ముక్కు, నరాలు, మెదడు నాళాలతో అనుసంధానించబడి ఉంటుంది. అందుకే ఏది దెబ్బతిన్నా తలనొప్పి రావడానికి ఆస్కారం ఉంటుంది. తలనొప్పి వచ్చినప్పుడు ఏవో మాత్రలు వేసుకుని ఉపశమనం పొందే బదులు శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించాలి. దీని కోసం ఆయుర్వేదంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటితో తలనొప్పిని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ పరిష్కార మార్గాన్ని ఎంచుకోవడం మంచిదే.
తలనొప్పి నివారణకు చాలా మంది టీ తాగుతుంటారు. కానీ ఇది ఆయుర్వేదంలో చెప్పిన మార్గంగా ఎంచుకోవడం సురక్షితమే. దీని కోసం ఒక గ్లాసు నీటిలో అర చెంచా వాము, ఒక చెంచా యాలకుల పొడి, ఒక చెంచా ధనియాలు, ఐదు పుదీనా ఆకులు మరిగించి తాగితే ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ప్రొటీన్లతో మనకు తలనొప్పి రాకుండా చేస్తాయి. ఉదయం నిద్ర లేవగానే ఈ టీని తాగితే కచ్చితంగా తలనొప్పి బాధ నుంచి ఉపశమనం పొందుతాం. మళ్లీ రాకుండా పోతుందని గుర్తుంచుకోవాలి.

ఆయుర్వేదంలో ఎన్నో రోగాలకు సులభంగా నయమయ్యే మందులు దొరుకుతాయి. వాటిని మనం పద్ధతి ప్రకారం వాడితే మంచి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ నేపథ్యంలో మనం ఏవో టీలు తాగే బదులు ఇలాంటి టీ తయారు చేసుకుని తాగడం వల్ల తలనొప్పి శాశ్వతంగా దూరం అవుతుంది. దీనికి గాను సులభంగా మన ఇంట్లో దొరికే వాటితోనే తయారు చేసుకోవడం వల్ల మనకు ఖర్చు కూడా ఉండదు. ఇలాంటి చిన్న పరిష్కారాలతో పెద్ద పెద్ద రోగాలను సైతం నయం చేసుకోవచ్చని చెబుతున్నారు.