spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Overseas Advance Bookings: ఓవర్సీస్ లో మొదలైన 'ఉస్తాద్ భగత్ సింగ్'...

Ustaad Bhagat Singh Overseas Advance Bookings: ఓవర్సీస్ లో మొదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అడ్వాన్స్ బుకింగ్స్.. అప్పుడే ఎంత గ్రాస్ వచ్చిందంటే!

Ustaad Bhagat Singh Overseas Advance Bookings: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ నిన్న అర్థ రాత్రి నుండి మొదలయ్యాయి. నార్త్ అమెరికా లో ఈ చిత్రం ప్రీమియర్ షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉంటాయో అని అభిమానులు ముందుగా కంగారు పడ్డారు. ఎందుకంటే ఈమధ్య కాలంలో నార్త్ అమెరికాలో ఫక్తు కమర్షియల్ సినిమాలు పెద్దగా ఆడడం లేదు. కేవలం జెన్ జీ ఆడియన్స్ కి తగ్గట్టుగా తీస్తున్న సినిమాలకే ఎక్కువ క్రేజ్ ఉంది. ఓజీ చిత్రం అలాంటిదే. అందుకే ఆ సినిమాకు కేవలం ప్రీమియర్ షోస్ నుండే 3 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ మాస్ మసాలా సినిమా కావడంతో దీనికి పెద్దగా క్రేజ్ ఉండదని అంతా అనుకున్నారు.

Also Read: రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కారణమా..?

దానికి తోడు ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదల చేసిన కంటెంట్ కి కూడా గొప్ప రెస్పాన్స్ రాలేదు. ‘దేఖ్లేంగే సాలా ‘ పాటకు మంచి రెస్పాన్స్ ఎవచ్చింది. ఆ తర్వాత విడుదలైన రెండవ పాటకు డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది కానీ రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ టీజ్ వీడియో కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఎందుకో అభిమానులు ఓజీ చిత్రానికి వచ్చినంత క్రేజ్ ఈ సినిమాకు రావడం లేదని ఫీల్ అవుతూ ఉండేవారు. దీని ప్రభావం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ మీద బలంగా పడుతాయి, ఇక ప్రతీ రోజు యాంటీ ఫ్యాన్స్ నుండి ట్రోల్స్ ఎదురుకోవాల్సి ఉంటుంది అంటూ భయపడ్డారు. కానీ అభిమానుల అంచనాలను తారుమారు చేస్తూ , ఈ చిత్రానికి నార్త్ అమెరికా లో అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అయ్యాయి.

బుకింగ్స్ మొదలు పెట్టిన 15 గంటల లోపే ఈ చిత్రం నార్త్ అమెరికా లో లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ భారీగా పేలకపోయినప్పటికీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ పేరు మీద ఈ రేంజ్ గ్రాస్ రావడం అనేది చిన్న విషయం కాదని, సినిమా నుండి మంచి పాట లేదా ట్రైలర్ విడుదలైతే కచ్చితంగా ఈ సినిమా నార్త్ అమెరికా నుండి 1.5 మిలియన్ డాలర్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటి వరకు కేవలం 500 షోస్ మాత్రమే షెడ్యూల్ చేశారు. రేపు రెగల్ చైన్ కి సంబంధించిన థియేటర్స్ బుకింగ్స్ ప్రారంభిస్తారట. చూడాలి మరి ఫైనల్ గా ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రం ఎంత గ్రాస్ ని రాబడుతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper