Sunlight Benefits: మన ఆరోగ్యం కోసం ఎన్నో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. మారుతున్న కాలానుగుణంగా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అనారోగ్యం అందరిని బాధిస్తోంది. ఈ నేపథ్యంలో మన శరీరం సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయినా మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల చిట్కాలు తీసుకోవాలి. దీంతో ప్రస్తుత కాలంలో ఆరోగ్య రక్షణకు ఎంతో శ్రమించాల్సి వస్తుంది. దీనికి కారణం మనం తీసుకునే ఆహారాలే. ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఫలితంా మందులు వాడుతున్నాం.

అరవై ఏళ్లలో రావాల్సిన రోగాలను ఇరవై ఏళ్లకే ఆహ్వానిస్తున్నాం. అనారోగ్యాలను దూరం చేసుకునే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మన శరీరానికి డి విటమిన్ ఎంతో అవసరం. ఇది సూర్యరశ్మి ద్వారానే వస్తుంది. మనం ఎండలో ఉంటే చాలు ఇది మనకు ప్రవేశిస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది ఎండలో కూడా తిరగలేని పరిస్థితి. దీంతో వారికి డి విటమిన్ లోపం వేధిస్తుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎండలో ఉంటే డి విటమిన్ వస్తుంది. అంటే అంత సేపుకాదు ఇరవై నిమిషాల పాటు ఎండలో ఉంటే మనకు డి విటమిన్ లభిస్తుంది.
డి విటమిన్ లోపిస్తే గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటివి రావడానికి కారణమవుతుంది. అందుకే ఎండలో ఉండటానికి ప్రయత్నించాలి. ఆరోగ్య నిపుణులు కూడా ఎండతో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. తగినంత ఎండ లేకపోతే మన జుట్టు కూడా తెల్లగా మారుతుంది. సూర్య కాంతి వల్ల కూడా మన ఆరోగ్యం సిద్ధిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. డి విటమిన్ మనకు కావాల్సినంత లభించకపోతే ఇబ్బందులు వస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు ఎండలో ఉంటే కూడా లాభమే.

ఎండలో ఉండటానికి వీలు కాని వారు పుట్టగొడుగులు, పన్నీర్, చేపలు, కోడిగుడ్లు, లివర్ వంటివి ఆహారంగా తీసుకుంటే డి విటమిన్ లోపాన్ని తప్పించుకోవచ్చు. ఇది లోపిస్తే ఎముకలు బలహీన పడతాయి. మానసికంగా కుంగిపోతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ వల్ల మనకు ఇన్ని లాభాలు ఉన్నందున వీలైనప్పుడల్లా సూర్యకాంతిని ఆస్వాదించడం ఎంతో ఉత్తమం. ఈ క్రమంలో మనం ఎండలో నిలబడి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అందరు గుర్తుంచుకోవాలి.