Homeఎంటర్టైన్మెంట్Jr NTR Angry Fan: హాస్పిటల్ లో అభిమాని పై ఆవేశంతో ఊగిపోయిన ఎన్టీఆర్...

Jr NTR Angry Fan: హాస్పిటల్ లో అభిమాని పై ఆవేశంతో ఊగిపోయిన ఎన్టీఆర్ ..వీడియో వైరల్!

Jr NTR Angry Fan: అభిమానులకు కేవలం ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి, సందర్భాలతో సంబంధం లేదు. తమ అభిమాన హీరో కళ్ళ ముందు కనిపిస్తే ఆనందం తట్టుకోలేక అరిచేస్తుంటారు ఫ్యాన్స్. అది హాస్పిటల్ అయినా , గుడి అయినా , వేరే ఏ స్థానం లో అయినా ఇది మారదు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ సభల్లో ఇలాంటివి మనం చూస్తుంటాము. ఆయన ఏ పనికి వెళ్లినా అభిమానులు ‘సీఎం సీఎం’ అని అరవడం , లేదంటే ‘ఓజీ.. జై పవర్ స్టార్ ‘ అంటూ అభిమానులు నినాదాలు చేయడం వంటివి ఎన్నో సందర్భాల్లో చూశాము . పవన్ కళ్యాణ్ వాళ్లపై చిరాకు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. అభిమానులను తన సొంత కుటుంబ సభ్యులతో సమానంగా చూసే ఎన్టీఆర్ లో ఇంత కోపం ఇప్పటి వరకు అభిమానులు చూడలేదు.

Also Read: రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కారణమా..?

పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు లోని కిమ్స్ హాస్పిటల్స్ నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవానికి విచ్చేశాడు. ఎన్టీఆర్ వస్తున్నాడు అనే విషయాన్నితెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున హాస్పిటల్ కి చేరుకున్నారు. రోడ్డు మీద ఎన్టీఆర్ కి ఘనంగా పూలమాలలు వేస్తూ, ప్రాంగణం మొత్తం ‘జై ఎన్టీఆర్ ‘ నినాదాలతో దద్దరిల్లిపోయేలా చేశారు. అయితే హాస్పిటల్ లోపల అభిమానుల కారణం గా ఎస్కలేటర్ విరిగిపోయింది. అంతే కాకుండా లోపల జై ఎన్టీఆర్ అంటూ అరుస్తున్న అభిమానిపై ఎన్టీఆర్ విరుచుకు పడ్డాడు. ‘ఏంట్రా బాబు నువ్వు.. బుద్దుందా ..ఇది హాస్పిటల్ , ఇక్కడికి వచ్చి అరవడం ఏంటి?’ అంటూ మండిపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూసిన తర్వాత నెటిజెన్స్ అభిమాని పై ఎన్టీఆర్ అలా అరవడాన్ని సమర్థిస్తున్నారు. అభిమానులకు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే విషయంపై క్లారిటీ ఉండాలి.

హాస్పిటల్ కి జనాలు రోగాలతో వస్తారు, అలాంటోళ్ళు ఉన్న చోట ఇలా అనడంతో తమ అభిమాన హీరో వచ్చాడని సంబరాలు చేసుకుంటే ఎలా ?, ఇది కరెక్ట్ కాదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు ఫ్యాన్స్. ప్రతీ హీరో కూడా అభిమానులను ఇలాంటి సందర్భాల్లో ఎన్టీఆర్ లాగానే కంట్రోల్ చెయ్యాలి, లేదంటే సమయం సందర్భం లేకుండా ఫ్యాన్స్ ఇష్టమొచ్చినట్టు వ్యవహరించి హీరో పరువు తీస్తారు అంటూ నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు. కానీ ఇన్ని రోజులు వెండితెర పై కనిపించిన హీరో ఒక్కసారిగా అలా బయటకు వచ్చినప్పుడు ఎవరైనా సహజసిద్ధంగానే కేరింతలు కొట్టేస్తుంటారు. వాళ్ళ తప్పు కూడా లేదు, ఎమోషన్ అలాంటిది, ఒక మనిషి ఎమోషన్ లో ఉన్నప్పుడు బుర్ర పని చెయ్యదు, అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular