Pakistan Animals: ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో రకరకాల జనాభా ఉన్నట్లుగానే జంతుజాలం కూడా ఉంటుదన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఒక్కో దేశంలో ఒక్కో జాతికి చెందిన జంతువులు ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొంది ఉంటాయి. భారతదేశంలో బెంగాల్ టైగర్లు ఉంటాయి. అలాగే చైనాలో పాండాలు, ఆస్ట్రేలియాలో కంగారులు ఇలా దేశంలో కొన్ని జంతువులు ఉంటాయి.
ఈ తరహాలోనే దాయాది దేశం పాకిస్తాన్ లో కొన్ని జంతువులు ఉన్నాయి. అంతేకాదు ఆ ప్రాంతంలో మాత్రమే మనకు అవి కనిపిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.. ఆ దేశంలో ఏడు రకాలు జంతువులు కనిపిస్తాయట. అవి ఏంటి? అనేది ఇప్పుడు మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పాకిస్తాన్ లో మాత్రమే కనిపించే అడవి జంతువుల్లో మొదటిగా మార్ఖోర్ అనే అడవి మేక. ఇది పాక్ జాతీయ జంతువు. హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ మేక పాములకు తొలి శత్రువని అక్కడి ప్రజలు చెబుతుంటారు.. అంతేకాదు పాకిస్తానీ గూఢచార సంస్థ ఐఎస్ఐ చిహ్నంలో కూడా మార్ఖోర్ కనిపిస్తుండటం గమనార్హం.
తరువాత బ్లైండ్ డాల్ఫిన్.. ఇది కూడా దాయాది దేశంలో మాత్రమే కనిపిస్తుంది. సింధు నదిలో ఇవి ఎక్కువగా ఉంటాయని సమాచారం.
అడవి పిల్లి శాండ్ క్యాట్.. ఇవి పాకిస్తాన్ లోని ఎడారుల్లో దర్శనమిస్తుంటాయి.
తరువాత గ్రే గోరాల్ అనే జింక. ఇవి కూడా పాక్ లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి..
అలాగే మరో అడవి మేక చిల్టన్ వైల్డ్ గోట్.. కొండల్లో గుట్టల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
పాకిస్తాన్ లోని కిర్తార్ పర్వత ప్రాంతాల్లో కనిపించే మరో జంతువు.. జింక జాతికి చెందిన సింధ్ ఐటెక్స్. వీటినే తుర్క్ మన్ అడవి మేకలు అని కూడా అంటారని తెలుస్తోంది.
లాస్ట్ గా ఉత్తర పాకిస్తాన్ లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే మనకు కనిపించే జంతువు స్నో లెపర్డ్.