https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: యావర్ ఆరోగ్యంతో అమర్ దీప్ ఆటలు.. అతని ఫుడ్ లో అది కలిపి, వీడియో వైరల్

విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ .. నోరేసుకుని పడిపోతున్నాడు. ముఖ్యంగా ప్రశాంత్, యావర్ లను చాలా చులకనగా మాట్లాడుతున్నాడు. నిన్న జరిగిన బాల్స్ టాస్క్ లో అమర్ రెచ్చిపోయాడు.

Written By: , Updated On : December 9, 2023 / 06:09 PM IST
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఫినాలే వీక్ లో ఏ సీజన్ లో లేనన్ని గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమర్ దీప్ తన కోపం .. గర్వం .. సైకోయిజంతో దిగజారి ప్రవర్తిస్తున్నాడు. ఓట్ అప్పీల్ చేసుకునేందుకు జరుగుతున్న టాస్కుల్లో అమర్ చేస్తున్న రచ్చ మాములుగా లేదు. విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ .. నోరేసుకుని పడిపోతున్నాడు. ముఖ్యంగా ప్రశాంత్, యావర్ లను చాలా చులకనగా మాట్లాడుతున్నాడు. నిన్న జరిగిన బాల్స్ టాస్క్ లో అమర్ రెచ్చిపోయాడు.

అయితే గత ఎపిసోడ్ లో ప్రశాంత్ పట్ల అమర్ దీప్ ప్రవర్తించిన తీరు నిజంగానే దారుణం. తిట్టడం .. కొట్టడం .. ఒరేయ్ .. తురేయ్ అని పిలవడం. ఒక పక్క ఒరేయ్ అని పిలవద్దు .. పేరు పెట్టి పిలువు అన్న .. అని ప్రశాంత్ చెప్తున్నా వినలేదు. రా .. అనే పిలుస్తారా అంటూ ఇష్టమొచ్చినట్టు అమర్ మాట్లాడాడు. తోసుకుంటూ ప్రశాంత్ ని కన్ఫెషన్ రూం దగ్గరకు తీసుకెళ్లిన తీరుపై ఎన్నో రకాల విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఇది ఇలా ఉండగా .. యావర్ విషయంలో అమర్ దీప్ చేసిన పనికి నెటిజన్స్ బండ బూతులు తిడుతున్నారు. యావర్ తనకు సపోర్ట్ చేయలేదు అనే కోపంతో అమర్ పదే పదే గొడవ పెట్టుకుంటున్నాడు. తనకు నచ్చని వాళ్ళతో క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో యావర్ కోసం నెయ్యి లేని రోటీలు చేసి ఉంచారు. కానీ తనతో గొడవ పెట్టుకున్నాడన్న కారణంగా వాటిని నెయ్యి వేసి చేసిన వాటిలో కలిపేసాడు.

నిజానికి యావర్ అంతకు ముందే కేక్ తినే టాస్క్ ను హౌస్ కోసం ఆడాడు. దీంతో కడుపులో ఇబ్బందిగా ఉందని నెయ్యి లేని రోటీలు అడిగాడు యావర్. కానీ అమర్ వాటిని నెయ్యి వేసిన వాటిలో కలిపేసి ఇప్పుడెలా తింటాడో చూద్దాం అంటూ దిగజారి ప్రవర్తించాడు. ఈ వీడియో షేర్ చేసి అమర్ ని బండ బూతులు తిడుతూ .. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్ హోదాలో అమర్ చేస్తున్న పనులు విమర్శల పాలవుతున్నాయి.