Rajashekhar: హీరో కి తక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ లా తయారైన రాజశేఖర్ కెరియర్…

హీరోగా సినిమాలు చేయడం ఆపేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో తనకు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలని ఉద్దేశ్యం తోనే ఆయన ఈ సినిమాలో కీలకపాత్ర లో నటించాడు. అయినప్పటికీ ఈ సినిమా అనేది కొంతవరకు తడబడింది అనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : December 9, 2023 5:49 pm

Rajashekhar

Follow us on

Rajashekhar: నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్ లో వచ్చిన ఎక్స ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో నితిన్ ఫ్యాన్స్ మరోసారి నిరాశ చెందాల్సిన అవసరం అయితే వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా కథలో కొంత విషయం ఉన్నప్పటికీ డైరెక్టర్ వంశీ దాన్ని సరిగ్గా తీయలేదు అనే ఉద్దేశ్యం లో ప్రేక్షకులు ఈ సినిమా ని ఫ్లాప్ గా గుర్తిస్తున్నారు.

అయితే ఎన్నో అంచనాలు పెట్టుకొని రాజశేఖర్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. రాజశేఖర్ పాత్ర కొంతవరకు సినిమాకి ప్లస్ అయినప్పటికీ అది ఆయన కి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటి వరకు రాజశేఖర్ ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ అయి ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు రాజశేఖర్ కెరీర్ కూడా కొంతవరకు డైలమా లో పడిందనే చెప్పాలి.

ఆయన హీరోగా సినిమాలు చేయడం ఆపేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో తనకు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలని ఉద్దేశ్యం తోనే ఆయన ఈ సినిమాలో కీలకపాత్ర లో నటించాడు. అయినప్పటికీ ఈ సినిమా అనేది కొంతవరకు తడబడింది అనే చెప్పాలి.ఇక ఇప్పుడు ఆయనకి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ వస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ సినిమా గనుక సక్సెస్ అయితే చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఆయన చుట్టూ సినిమా చేయమని తిరుగుతూ ఉండేవారు. ఇక ఇప్పుడు మళ్లీ రాజశేఖర్ హీరోగా కొన్ని సినిమాల్లో చేస్తాడా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కొనసాగుతాడా అనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.ఇక ఇలాంటి సమయంలో రాజశేఖర్ కి హీరో గా మార్కెట్ అయితే లేదు.

కాబట్టి రాజశేఖర్ ని పెట్టుకొని సినిమాలు చేసే అంత రేంజ్ అయితే లేదు కాబట్టి ఒక వేళ ఏదైనా అవకాశాలు వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తాడు లేదంటే సినిమాలకి కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చే అవకాశం కూడా ఉంది.అయితే ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో చేసిన క్యారెక్టర్ తో రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా టాప్ పొజిషన్ కి వెళ్ళిపోతాడు అని ఊహించుకున్నాడు కానీ సినిమాలో పెద్దగా మ్యాటర్ లేకపోవడంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలబడలేకపోయాడు…