Crab Blood: పీత రక్తం లీటరు ధర ఎంతో తెలిస్తే.. అమ్మో ఇన్ని లక్షలా అని నోరేళ్ల బెడతారు

పితల్లో ఒక రకమైన హార్స్ షూ చాలా ఖరీదైనది. ఇది దాదాపుగా 450 మిలియన్ల సంవత్సరాల నుంచి ఉందట. పురాతన జీవుల్లో ఈ హార్స్ షూ కూడా ఒకటి. అయితే ఇవి చూడటానికి సాధారణ పీతల్లాగానే ఉంటుంది.

Written By: Neelambaram, Updated On : September 17, 2024 5:33 pm

Crab Blood

Follow us on

Crab Blood: ఈ ప్రపంచంలో ఎన్నో ఖరీదైన వస్తువులు ఉన్నాయి. మనం నమ్మలేని కొన్ని వస్తువులకు అధిక ధర ఉంటుంది. అయితే ఈ కేటగిరీలో చాలా వస్తువులు ఉన్నాయి. కానీ ఓ జంతువు రక్తం కూడా ఖరీదు అని విషయం మీకు తెలుసా? చాలామంది ఇష్టంగా పీతలు తింటారు. తినడానికి రుచిగా కూడా ఉంటాయి. అయితే ఇందులో ఒక రకమైన పీతల్లో ఉండే రక్తం అత్యంత ఖరీదైనది. అసలు ఈ పీతల రక్తానికి ఎందుకు అంత డిమాండ్? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఏదైనా ఔషధాల తయారీకి ఈ రక్తాన్ని ఉపయోగిస్తారా? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పితల్లో ఒక రకమైన హార్స్ షూ చాలా ఖరీదైనది. ఇది దాదాపుగా 450 మిలియన్ల సంవత్సరాల నుంచి ఉందట. పురాతన జీవుల్లో ఈ హార్స్ షూ కూడా ఒకటి. అయితే ఇవి చూడటానికి సాధారణ పీతల్లాగానే ఉంటుంది. కానీ మిగత పీతలతో పోలిస్తే ఈ పీతల రక్తం చాలా ఖరీదైనది. సాధారణంగా పీతల రక్తం నీలం రంగులో ఉంటుంది. ఇందులో ఉండే హిమోసైనిన్ కారణంగా ఈ రంగులో పీతల రక్తం ఉంటుంది. అయితే ఈ హార్స్ షూ పీత రక్తాన్ని బ్లూ గోల్డ్ అని అంటారు. ఎందుకంటే ఈ పీత రక్తం చాలా ఖరీదు. ఒక లీటరు రక్తం దాదాపుగా 15 వేల డాలర్లు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 12 లక్షల రూపాయలు అన్నమాట. ఒక్క ఈ పీతను పట్టుకుంటే చాలు. ఒక్కసారి లక్షాధికారి అయిపోవచ్చు. అయితే ఈ పీత రక్తంతో ఏం చేస్తారు? ఎందుకు ఇది రేటు అని చాలామందికి సందేహం ఉంది. ఈ పీత రక్తాన్ని కొన్ని డ్రగ్స్ ఉత్పత్తుల తయారీలో వాడుతారు. అందుకే ఈ రక్తానికి విలువ ఎక్కువ. ఈ పీతల రక్తంలో లిమ్యులస్ అబీమోసైట్ లైసేట్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. దీనివల్ల మనషులకు అధికంగా వచ్చే అలర్జీల నుంచి కాపాడవచ్చు. అలాగే ఎండోటాక్సిన్స్‌ అనే తీవ్రమైన విషాలను కూడా ఈ పీత రక్తంతో గుర్తించవచ్చు.

సాధారణంగా ఈ హార్స్ షూ పీతలు కనిపించవు. అయితే ఇవి కేవలం ఎక్కువగా అమెరికా తీర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. వైద్యానికి ఈ పీతల రక్తం అవసరం చాలా ఉంది. కాబట్టి ఏటా వీటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. దాదాపుగా ఆరు లక్షల పీతలను పట్టుకుంటారు. ఇలా పట్టుకున్న పీతల్లో ఒక్కో దాని నుంచి 30 శాతం రక్తాన్ని బయటకు తీస్తారు. ఇలా వీటి నుంచి రక్తం సేకరించడం వల్ల పీతల జనాభా తగ్గిపోతుందని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ఇలా రక్తం తీసే సమయంలో సగం పీతలు చనిపోతాయి. మిగతా పీతలను మళ్లీ సముద్రంలో విడిచిపెడతారు. కానీ ఇవి జీవిస్తాయో లేదో కూడా సరిగ్గా తెలియదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయని అంటున్నారు.