Apoorva: క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ ఇప్పుడు ఎలా ఉందో చూశారా? ఈమె పక్కన హీరోయిన్లు కూడా పనికి రారు

అల్లరి సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ.. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో ఆమె హీరో తల్లిగా నటించింది.

Written By: Neelambaram, Updated On : September 17, 2024 5:41 pm

Apoorva

Follow us on

Apoorva: సినిమాల్లో హీరోయిన్ల కంటే క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వీళ్లు సినిమాలో చాలా తక్కువ సమయమే కనిపించినప్పటికీ వీళ్ల క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్లకు అంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే మనం చిన్నప్పుడు చూసిన సినిమాల్లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇప్పటికీ అలానే ఉంటున్నారు. మన వయస్సు పెరుగుతుంది. కానీ వాళ్ల వయస్సు మాత్రం పెరగడం లేదా? లేకపోతే యంగ్‌గా ఉండటానికి ఎలాంటి నియమాలు పాటిస్తున్నారో అనే సందేహం మనలో చాలామందికి వస్తుంది. ఇలా అప్పుడు సినిమాల్లో నటించిన వాళ్లు మాళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నారో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి అపూర్వ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో చేసేటప్పుడు గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అప్పటికీ ఆమె వయస్సు తక్కువే. కానీ తల్లి క్యారెక్టర్లు కూడా నటించేది. అయితే ప్రస్తుతం ఈమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో నెట్టంట వైరల్ అవుతున్నాయి. మరి అవేంటో చూద్దాం.

Apoorva(1)

అల్లరి సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ.. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో ఆమె హీరో తల్లిగా నటించింది. ఆంధ్ర్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు గ్రామానికి చెందినది. నటిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈమె అనేక సినిమాల్లో నటించింది. తన అందం, నటనతో కుర్రకారును ఫిదా చేసింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లోనే అపూర్వ తన నటనతో అందరినీ మెప్పించింది. అయితే ప్రస్తుతం ఈమె సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు పూర్తిగా సినిమాల్లో కనిపించడమే మానేశారు. ఏదో ఒక సినిమాల్లో కనిపిస్తున్నారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటారు. తన హాట్ అందాలతో కుర్రకారును మత్తెక్కిస్తారు. ఎప్పుడు తన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటునే ఉంటారు. అయితే ఈక్రమంలో ఆమె తాజా ఫొటోలు చూసి నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ఈమె అందం పక్కన హీరోయిన్లు కూడా పనికి రారని కామెంట్లు చేస్తున్నారు. అలాగేయ తన పాత ఫొటోలతో కూడా పోల్చుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ అదే అందం ఉందని ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మనం చిన్నప్పుడు చూసిన ఆమె అప్పటికీ ఇప్పటికీ అలానే ఉంది. కానీ మనం మాత్రం మారిపోయాం. ఆమె వయస్సు, అందం అలాగే ఉందని, మన వయస్సే పెరిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు నటి అపూర్వ ఫొటోలు చుశారా? లేకపోతే ఆలస్యం చేయకుండా ఒకసారి చూడండి.