Naga Chaitanya Vrusha Karma Teaser: ‘తండేల్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) హీరో గా నటిస్తున్న చిత్రం ‘వృష కర్మ'(Vrusha Karma Movie). ‘విరూపాక్ష’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇదొక అడ్వెంచర్ సినిమా అని అంతా అనుకున్నారు కానీ, వెన్నులో వణుకు పుట్టించే హారర్ అడ్వెంచర్ ఫాంటసీ చిత్రమని ఎవ్వరూ ఊహించలేకపోయారు. నేడు విడుదల చేసిన గ్లింప్స్ వీడియో వేరే లెవెల్ లో ఉందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం విజువల్స్ బాగానే ఉన్నాయి కానీ, ‘విరూపాక్ష ‘ రేంజ్ లో హారర్ ఎలిమెంట్స్ లేవని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కచ్చితంగా వర్కౌట్ అయ్యే సినిమా లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి హారర్ ఎలిమెంట్స్ కేవలం థియేటర్ లో మాత్రమే సరైన అనుభూతిని ఇస్తుంది.
విరూపాక్ష కూడా టీజర్, ట్రైలర్ లతో పెద్దగా ప్రేక్షకుల్లో భయం పుట్టించే రేంజ్ ని క్రియేట్ చేయలేదు. కానీ థియేటర్ లో మాతం సీట్ ఎడ్జ్ లో కూర్చొని ఎంజాయ్ చేసేలా హారర్ ఎలిమెంట్స్ క్లిక్ అయ్యాయి. అంతే కాకుండా ఇలా హారర్ తో కూడిన అడ్వెంచర్ చిత్రాలు ఈమధ్య కాలం లో రాలేదు. కేవలం హారర్ , లేదా కామెడీ హారర్ సినిమాలు ఈమధ్య కాలం లో ఎక్కువ వచ్చాయి కానీ, ఇలాంటి జానర్ లో రావడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ చిత్రం లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈమెకు మరోసారి మంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కినట్టుగా అనిపించింది. ‘అతీంద్ర శక్తి మేలుకునప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు , విధి ఒక వృష కర్మాణి ఎంచుకుంటుంది ‘ అనే భారీ డైలాగ్ తో నాగ చైతన్య ఇంట్రడక్షన్ ని ఈ గ్లింప్స్ వీడియో చూపించారు.
ఇక టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి అనేది అంచనా వేయాల్సి వస్తే, క్షుద్ర శక్తులు అవపోసిన పట్టిన ఒక వ్యక్తి , ఒక పేపర్ మీద స్కెచ్ గీయడం , ఆ స్కెచ్ లో ఒక వ్యక్తి నోటి నుండి పక్షి బయటకు రావడం వంటివి చూపడం , అక్కడ ఏదైతే చూపించారో, నిజంగానే ఆ బొమ్మ గీసిన వ్యక్తి నోటి నుండి ఒక పక్షి రావడం, ఆ పక్షి వచ్చినప్పటి నుండి ఊర్లో వింత వింత సంఘటనలు జరగడం, ఈ సంఘటనలు జరగడానికి కారణం కనుక్కొని, ఆ అతీంద్ర శక్తిని అంతం చేసే పాత్రలో హీరో ని చూపించినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ గ్లింప్స్ వీడియో ని మీరు కూడా చూసేయండి.
