Best Car: లాంగ్ జర్నీ చేసే ఫ్యామిలీకి బెస్ట్ కారు.. అందుకే విపరీతమైన అమ్మకాలు..ఇంతకీ ఈ కారు ఏదంటే?

ప్రస్తుతం మార్కెట్లో 7 సీటర్ కార్లు ఎన్నో ఉన్నాయి. కానీ మంచి ఫీచర్స్ తో పాటు మైలేజ్ ఇచ్చే వాహనాలను మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇదే సమయంలో బడ్జెట్ లో ఉండే కారు కోసం ఎదురుచూస్తున్నారు.

Written By: Chai Muchhata, Updated On : September 17, 2024 5:29 pm

Best Car

Follow us on

Best Car: నేటి కాలంలో చాలా మంది ఫ్యామిలీతో కలిసి లాంగ్ జర్నీ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇతర వాహనాల్లో ప్రయాణం చేయడం ఇబ్బంది. పోనీ అద్దె వాహనంలో వెళ్దామంటే ఛార్జీలు విపరీతంగా ఉన్నాయి. దీంతో చాలా మంది కారు కొనాలని అనుకునేవారు కార్యాలయ అవసరాలతో పాటు విహార యాత్రలకు ఉపయోగపడేవిధంగా వెహికల్ ను కొనుగోలు చేస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వేయడానికి 4 నుంచి 5 సీట్ల కారు సరిపోతుంది. 7 సీటర్ కారు కంపోర్టబుల్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఓ కంపెనీకి చెందిన 7 సీటర్ కారును విపరీతంగా కొరుకుంటున్నారు. దీంతో గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఇంతకీ ఆ కారు ఏది? ఎన్ని యూనిట్ల విక్రయాలు జరుపుకున్నాయి?

ప్రస్తుతం మార్కెట్లో 7 సీటర్ కార్లు ఎన్నో ఉన్నాయి. కానీ మంచి ఫీచర్స్ తో పాటు మైలేజ్ ఇచ్చే వాహనాలను మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇదే సమయంలో బడ్జెట్ లో ఉండే కారు కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసం మారుతి కంపెనీ ఓ 7 సీటర్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ఎర్టీగా. మారుతి ఎర్టీగా గురించి ఇప్పటికే కారు వాడే వారికి తెలిసే ఉంటుంది. కానీ గత నెలలో దీని అమ్మకాలు చూసి షాక్ అవుతున్నారు. అంతకుముందు కంటే గత నెలలో దీని అమ్మకాలు పెరిగిపోవడంతో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

మారుతి ఎర్టీగా ఆగస్టు నెలలో మొత్తం18,580 యూనిట్ల విక్రయాలు జరుపుకున్నట్లు తెలుస్తోంది. 2023 ఆగస్టు నెలలో ఇదే కారు 12, 315 కార్లు అమ్ముడు పోయాయి. వార్షిక లెక్కన చూస్తే మారుతి ఎర్టీగా అమ్మకాలు 51 శాతం పెరిగాయి. అయితే మిగతా కార్ల కంటే ఈ కారు వార్షిక వృద్ధిలో ఎక్కువగా ఉండడం విశేషం. మారుతి ఎర్టీగా తరువాత మహీంద్రా స్కార్పియో, టయోటా ఇన్నోవాలు ఉన్నాయి. ఇవి వరుసగా 39శాతం, 12 శాతంగా వృద్ధినినమోదు చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో మిగతా కార్ల కంటే ఎక్కువగా ఎర్టీగాను కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఎర్టీగా 9వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎజ్ జీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. వీటిలో vxi వేరియంట్ ను రూ.9.49 లక్షలతో విక్రయిస్తున్నారు. ఇది 20.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆరు రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ మోడల్ 102 బీహెచ్ పీ పవర్ తో పాటు 136 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది.

ఇందులోఎల్ ఈడీ డీఆర్ఎల్ తో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులు, క్రోమ్ ఇన్వర్ట్ లతో పాటు ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ లాంప్స్ ఉన్నాయి. 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో పాటు ప్లోటింగ్ఉ రూప్ లైన్ ఆకర్షిస్తుంది. సరికొత్త డిజైన్ లో కనిపించే ఈ కారు తక్కువ ప్రీమియంలో లభించే బెస్ట్ 7 సీటర్ కారుగా పేర్కొంటారు.