Balakrishna Daughter: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు..? ఆయన పాత సినిమాలకు కనెక్ట్ కానీ యూత్ అంటూ ఎవడైనా ఉంటాడా..ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నా..పవన్ కళ్యాణ్ పాత సినిమాలు..ఆయన లుక్స్ , నటన , యాటిట్యూడ్ ఇవన్నీ మనిషి అన్నోడు నచ్చకుండా ఉండరు..అందుకే ఆయనకీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది..హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా తన తదుపరి చిత్రానికి బీభత్సమైన ఓపెనింగ్స్ వస్తుంటాయి.

పవన్ కళ్యాణ్ కి సెలబ్రిటీస్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ..కుర్ర హీరోలందరూ ఆయన అభిమానులే..అయితే లేటెస్ట్ గా జాబితాలోకి నందమూరి కుటుంబ సభ్యులు కూడా చేరారు..బాలయ్య చిన్న కూతురు తేజస్విని మరియు కుమారుడు మోక్షజ్ఞ తేజ పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్స్ అట..ఈ విషయాన్నీ స్వయంగా బాలయ్య బాబు నిన్న జరిగిన ‘అన్ స్టాపబుల్ ‘ షో షూటింగ్ లో పవన్ కళ్యాణ్ తో చెప్తాడు.
ఇక నిన్న జరిగిన ‘అన్ స్టాపబుల్’ షోకి పవన్ కళ్యాణ్ ని కలవడం కోసం తేజస్విని మరియు మోక్షజ్ఞ ఇద్దరు ఉదయం నుండే వేచి ఉన్నారట..షో మొత్తం అయ్యిపోవస్తున్న సమయం లో బాలయ్య బాబు మోక్షజ్ఞ ని పిలిచి పవన్ కళ్యాణ్ తో ఫోటో తీయించి పంపాడట..ఇది ఎపిసోడ్ లో కూడా ఉండబోతుంది..నందమూరి కుటుంబం లో పవన్ కళ్యాణ్ అభిమానులు..ఇది వింటుంటేనే ఎంతో విచిత్రం గా ఉంది కదూ.

మరో విశేషం ఏమిటంటే నిన్న తేజస్విని కేవలం పవన్ కళ్యాణ్ ని కలవడం కోసమే హైదరాబాద్ కి వచ్చిందట..అప్పటి వరకు ఆమె విదేశాల్లో ఉన్నిందట..ఇదంతా అన్ స్టాపబుల్ షో లో బాలయ్య బాబు చెప్పినట్టు తెలుస్తుంది..నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ ఎపిసోడ్ షూటింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది..అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుంది.