Karate Kalyani: టాలీవుడ్ ఫైర్ బ్రాండ్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు కరాటే కళ్యాణి. ఈమె ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన సంచలనమే. తాజాగా కరాటే కళ్యాణి తన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సమాజం తనను వక్ర దృష్టితో చూస్తుదంటూ కన్నీరు పెట్టుకున్నారు. తాగుబోతు భర్త కారణంగా చిత్ర హింసలు పడ్డాను. తాగొచ్చి అర్థరాత్రి వండిపెట్టమంటే వండిపెట్టే దాన్ని. అతని చేతిలో తన్నులు తిన్నాను. నడిరోడ్డులో నా బట్టలు ఊడదీసి కొట్టాడు. అందుకే విడాకులు తీసుకున్నాను.

నాకు ఒంటరిగా ఉడాలంటే భయం. నాన్న చనిపోయాక తమ్ముడు, అమ్మతో ఉంటున్నాను. అమ్మకు ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో ఉంటే ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. అది నా వల్ల కాలేదు. మా తమ్ముడు వయసు 22 ఏళ్ళు.వాడికి పెళ్ళై, నేను చనిపోతే నువ్వు ఒంటరివి అయిపోతావు. వయసు ఉంది కాబట్టి పెళ్లి చేసుకో అని అమ్మ అంటుంది. అమ్మ మాట కోసం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. సంబంధాలు కూడా చూస్తున్నాము.
సినిమాల్లో నేను చేసే పాత్రల ఆధారంగా తప్పుడు దృష్టిలో చూస్తున్నారు. జీవనం కోసం అలాంటి పాత్రలు చేస్తాను కానీ నిజ జీవితంలో నేను తప్పులు చేయలేదు. నేను అలాంటి దానిని కాదు. సమాజం మాత్రం ఒక వ్యభిచారిలా చూస్తుంది.ఈజీగా మాటలు అనేస్తారు. నేను కష్టపడి పైకి వచ్చాను. ఇవన్నీ తలచుకున్నప్పుడు ఒంటరిని అనే భావన కలుగుతుంది. మనసు బరువెక్కి మరింత బాధేస్తుంది, అని కరాటే కళ్యాణి కన్నీరు పెట్టుకున్నారు.. కరాటే కళ్యాణి.. కృష్ణ, మిరపకాయ్ వంటి చిత్రాల్లో వ్యాంప్ రోల్స్ చేశారు. కృష్ణ మూవీలో ఆమె పాత్ర కొంచెం బోల్డ్ గా ఉంటుంది. ఇంటి ఓనర్ బ్రహ్మానందం తో ఎఫైర్ పెట్టుకున్న పనిమనిషి పాత్ర చేశారు ఆమె. చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ పలు వివాదాలతో ఆమె వార్తలకు ఎక్కారు.

ఇటీవల యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని రోడ్డుపై పరుగెత్తించి కొట్టింది. అర్ధరాత్రి వీరిద్దరూ పెద్ద న్యూసెన్స్ చేశారు. ఎస్ ఆర్ నగర్ పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరిపై కేసులు పెట్టారు. పోలీసుల మీద కూడా కరాటే కళ్యాణి మండిపడ్డారు. సరైన పాత్రలు లేకుండా ఒక ఆడపిల్లను పెంచుకుంటారనే ఆరోపణలపై ఆమె ఇంటిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదా చేశారు. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో కరాటే కళ్యాణి ప్రత్యర్థులపై మాటల తూటాలు వదిలింది.