Ponniyin Selvan 2: స్టార్ డైరెక్టర్ మణిరత్నం చాలా కాలం తర్వాత తన మార్క్ చూపించారు. మాస్టర్ ఫిల్మ్ మేకర్ గా పేరున్న మణిరత్నం ఓ సాలిడ్ హిట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. 2004లో విడుదలైన ‘యువ’ చిత్రం తర్వాత ఆయనకు హిట్ పడలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రావణ్ నిరాశపరిచింది. కడలి, చెలి, ఓకే బంగారం అంటూ వరుసగా లవ్ డ్రామాలు తెరకెక్కించారు. ఒకప్పుడు అద్భుత ప్రేమ కావ్యాలు అందించిన మణిరత్నం… ఆ చిత్రాలతో పరువు పోగొట్టుకున్నారు. దీంతో ఆయన కసిగా భారీ ప్రాజెక్ట్ నెత్తికెత్తుకున్నారు.

ఎప్పటి నుండో కోలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ గా ఉన్న పొన్నియిన్ సెల్వన్ ప్రకటించారు. గతంలో మణిరత్నం ఈ తరహా పీరియాడిక్ యాక్షన్ డ్రామాలు తెరకెక్కించలేదు. ఫార్మ్ లో లేని మణిరత్నం చేస్తున్న పొన్నియిన్ సెల్వన్ పై పెద్దగా అంచనాలు కూడా లేవు. భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ 1 సెప్టెంబర్ 30న ఐదు భాషల్లో విడుదల చేశారు. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. తమిళంలో మాత్రం బ్లాక్ బస్టర్ రివ్యూస్ పడ్డాయి.
తమిళ సినిమా ప్రైడ్ గా భావించి కోలీవుడ్ జనాలు ఆదరించారు. భారీగా ప్రమోట్ చేశారు. ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపకున్నా పొన్నియిన్ సెల్వన్ తమిళంలో రికార్డు వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ. 500 కోట్ల వసూళ్లు సాధించింది. లెక్కకు మించిన పాత్రలు, వారి పేర్లు ఆడియన్స్ ని అయోమయానికి గురి చేశాయి.

కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ సిరీస్ లోని పార్ట్ 1 సక్సెస్ అయినట్లే. అసలు కథ మొత్తం పార్ట్ 2లో ఉన్నట్లు సమాచారం. ఆసక్తికర ముగింపు సీక్వెల్ మీద అంచనాలు పెంచింది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్న నేపథ్యంలో వారికి గుడ్ న్యూస్ వచ్చింది. మేకర్స్ పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. 2023 ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నారు. కోలీవుడ్ పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని బాహుబలి కి పోటీగా భావిస్తుండగా… బాహుబలి 2 రిలీజైన తేదీనే పొన్నియిన్ సెల్వన్ 2 విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Let’s get those swords in the air as we await the 28th of April 2023!#CholasAreBack #PS1 #PS2 #PonniyinSelvan #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @Tipsofficial @tipsmusicsouth @IMAX @primevideoIN pic.twitter.com/gqit85Oi4j
— Lyca Productions (@LycaProductions) December 28, 2022