Dil Raju- Prabhas And Charan: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ ఎత్తున తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆయన ఏకంగా పాన్ వరల్డ్ చిత్రాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది. రానున్న ఐదేళ్లలో దిల్ రాజు ఉంది విజువల్ అండ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు విడుదల కానున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారు. లేటెస్ట్ ప్రెస్ మీట్ లో తమ నిర్మాణ సంస్థలో రూపొందనున్న అప్ కమింగ్ చిత్రాల డీటెయిల్స్ వెల్లడించారు. దిల్ రాజు విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా కొన్ని చిత్రాలు ప్లాన్ చేస్తున్నామన్నారు. అలాగే కొన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు ఉంటాయన్నారు.

వాటిలో కొన్ని చిత్రాల వివరాలు ఆయన వెల్లడించారు. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన మోహన కృష్ణ ఇంద్రగంటితో ‘జటాయు’ టైటిల్ తో మూవీ నిర్మించనున్నారట. జటాయు రామాయణంలో కీలక పాత్ర. సీతాపహరణను అడ్డుకునేందుకు జటాయు పక్షి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతుంది. ఆ పక్షి నేపథ్య ప్రధానంగా ఈ చిత్రం తెరకెక్కే సూచనలు కలవు. పౌరాణిక చిత్రం కావడంతో విజువల్స్ కి అధిక ప్రాధాన్యత ఉంటుంది.
అలాగే హిట్ సిరీస్ తో వెలుగులోకి వచ్చిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో కొన్ని ప్రాజెక్ట్స్ కి ఒప్పందం కుదుర్చుకున్నారట. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ ఉన్నట్లు తెలిపారు. ఈ చిత్ర టైటిల్ రావణం అట. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందిస్తారట. ఈ చిత్ర హీరో ఎవరనేది ఆయన చెప్పలేదు. అయితే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ నటిస్తాడనే ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ కి రెండో సినిమా అవుతుంది. ప్రస్తుతం వీరి కాంబోలో సలార్ సెట్స్ పై ఉంది.

అలాగే రామ్ చరణ్ తో కూడా ఓ భారీ బడ్జెట్ మూవీ దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న 50వ చిత్రంగా ఆర్సీ-15 ఉంది. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. ఒక మూవీ సెట్స్ పై ఉండగానే దిల్ రాజు మరో ప్రాజెక్ట్ చరణ్ తో ప్రకటించారు. ఇటీవల చరణ్ మొత్తం ఆరో ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టినట్లు చెప్పాడు. కాబట్టి దిల్ రాజు ప్రాజెక్ట్ వాటిలో ఒకటి కావచ్చు. ఇలా దిల్ రాజు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ తో ఏకంగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారని అర్థం అవుతుంది.