India vs Sri Lanka: కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక ఓటమి రికార్డు సృష్టించింది. వన్డే ఓటముల జాబితాలో 437వ ఓటమితో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇండియా 436 పరాజయాలతో రెండో స్థానంలో నిలిచింది. టీ20ల్లో కూడా అత్యధిక సార్లు ఓడిపోయిన జట్టుగా శ్రీలంక నిలవడం గమనార్హం. ఇంతవరకు 94 టీ20ల్లో ఓడిపోయింది. టీమిండియా చేతిలో లంక అత్యధిక మ్యాచ్ లు ఓడిపోవడం విశేషం. ఇప్పటివరకు ఇండియా వన్డేల్లో 95 సార్లు, టీ20ల్లో 19 సార్లు లంకను ఓడించింది.

భారత పర్యటనలో శ్రీలంక మూడు టీ20 సిరీస్ లు పోగొట్టుకుంది. రెండో వన్డేలో గెలిచిన ఇండియా వన్డే సిరీస్ ను సైతం దక్కించుకుంది. 216 టార్గెట్ చేదనలో భారత్ 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా కేఎల్ రాహుల్ అర్థ శతకం (64), హార్థిక్ పాండ్యా (32), అక్షర పటేల్ (21) తో కలిసి పరుగులు రాబట్టడంతో విజయం సాధించింది. మూడో వన్డే జనవరి 15న తిరువనంతపురంలో జరగనుంది. వన్డేల్లో ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు నమోదు చేసి జట్టుగా అవతరించింది.
లంకపై అత్యధికంగా 95 వన్డేల్లో గెలిచి తొలి స్థానంలో నిలిచిన జట్టుగా ఇండియా అవతరించింది. భారత్, లంక మధ్య ఇప్పటివరకు 164 వన్డేలు జరగ్గా 57 మ్యాచుల్లో ఇండియా విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థులైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన వన్డేల్లో కంగారూలే ఆధిపత్యం చెలాయించారు. న్యూజిలాండ్ పై జరిగిన 95 మ్యాచుల్లో గెలిచి ఇండియాతో కలిసి రికార్డు పంచుకుంటోంది. వన్డే మ్యాచుల్లో అత్యధిక పరాజయాలు చవిచూపిన జట్టుగా లంక నిలిచింది.

శ్రీలంక అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 880 వన్ేలు ఆడింది. ఇందులో 437 సార్లు పరాజయం పాలైంది. అత్యధిక మ్యాచుల్లో ఓడిపోయిన జట్టుగా మారింది. ఇండియా 436 ఓటములతో రెండో స్థానం దక్కించుకుంది. లంకతో పోలిస్తే అత్యధిక వన్డేలు ఆడిన భారత్ ఇప్పటివరకు ఆడిన వన్డేల్లో సంఖ్య 1022. టీ20ల్లోనూ 92 ఓటములతో అత్యధిక పరాజయాలు చవిచూసిన జట్టుగా శ్రీలంక రికార్డు దక్కించుకుంది. బంగ్లాదేశ్ కూడా 92 ఓటములతో శ్రీలంకతో సమానంగా ఉంది.