Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ సినిమా చేస్తే ఎదురుగా ఏ హీరో సినిమా అడ్డొచ్చిన బుల్డోజర్ లాగా తొక్కుకుంటూ వెళ్ళిపోతాడని ట్రేడ్ పండితులు అంటూ ఉంటారు.. ఈరోజు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కి వస్తున్న ఓపెనింగ్స్ చూస్తుంటే వాళ్ళు చెప్పింది నిజమే అని అనిపించక తప్పదు.. ఎందుకంటే నిన్ననే నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం విడుదల అయ్యింది.

సంక్రాంతికి విడుదల అవుతున్న మొట్టమొదటి పెద్ద సినిమా కాబట్టి థియేటర్స్ ‘వాల్తేరు వీరయ్య’ కంటే ఎక్కువగా దీనికే కేటాయించారు.. అమెరికా నుండి అనకాపల్లి వరకు ఇదే పరిస్థితి..కానీ ఈరోజు ‘వాల్తేరు వీరయ్య’ కి టాక్ రాగానే బ్లాక్ చేసిన ఆ థియేటర్స్ అన్నీ ఇచ్చేసారు.. ఓవర్సీస్ లో కూడా ఇదే పరిస్థితి..ఇక ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి మొదటి రోజు బంపర్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ రెండో రోజు వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి.. ఇది కూడా ‘వాల్తేరు వీరయ్య’ కి బాగా కలిసొచ్చింది.
చిరంజీవి సినిమాకి టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టేస్తారు..’వాల్తేరు వీరయ్య’ కి కూడా సాయంత్రం షోస్ నుండి ఆడియన్స్ రష్ విపరీతంగా ఉండే ఛాన్స్ ఉంటుందని గమనించిన బయ్యర్స్ ఖాళీగా ఉన్న ‘వీర సింహా రెడ్డి’ థియేటర్స్ ని ‘వాల్తేరు వీరయ్య’ కి కేటాయించారు.. ఇక రేపటి నుండి ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి సెలవుల్లో వీరంగం ఆడేస్తాడని ట్రేడ్ అంచనా వేస్తోంది.

మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట..ఇదే ట్రెండ్ రేపటి నుండి కొనసాగితే కేవలం వారం రోజుల లోపే ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్.. అదే కనుక జరిగితే మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోతోంది..చూడాలి మరి బాక్స్ ఆఫీస్ పరంగా ఈ సినిమా ఏ రేంజ్ కి వెళ్లబోతుందో అనేది