https://oktelugu.com/

Deepthi Sunaina Emotional: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లో దీప్తి కన్నీళ్లు.. వైరల్

Deepthi Sunaina Emotional: సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ప్రేమికులుగా వర్ధిల్లిన దీప్తి సునయన-షణ్ముఖ్ జోడీ బ్రేకప్ అందరినీ షాక్ కు గురిచేసిన సంగతి తెలిసిందే. ఏమైందో ఏమో కానీ నిన్న సడెన్ గా దీప్తి ఇలా సోషల్ మీడియాలో ప్రకటించేసరికి అందరూ అవాక్కయ్యారు.షణ్ముక్ బిగ్ బాస్ లో ‘సిరి’తో రెచ్చిపోయి టైటిల్ కోల్పోవడమే దీప్తి ఆగ్రహానికి కారణమని.. అందుకే ఆమె బ్రేకప్ చేసిందన్న గుసగుసలు వినిపించాయి. ఇక దీప్తి తనను విడిచిపెట్టినందుకు షణ్ముఖ్ బాధపడుతూ ఆమె […]

Written By:
  • NARESH
  • , Updated On : January 3, 2022 / 06:22 PM IST
    Follow us on

    Deepthi Sunaina Emotional: సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ప్రేమికులుగా వర్ధిల్లిన దీప్తి సునయన-షణ్ముఖ్ జోడీ బ్రేకప్ అందరినీ షాక్ కు గురిచేసిన సంగతి తెలిసిందే. ఏమైందో ఏమో కానీ నిన్న సడెన్ గా దీప్తి ఇలా సోషల్ మీడియాలో ప్రకటించేసరికి అందరూ అవాక్కయ్యారు.షణ్ముక్ బిగ్ బాస్ లో ‘సిరి’తో రెచ్చిపోయి టైటిల్ కోల్పోవడమే దీప్తి ఆగ్రహానికి కారణమని.. అందుకే ఆమె బ్రేకప్ చేసిందన్న గుసగుసలు వినిపించాయి.

    Deepthi Sunaina Emotional

    ఇక దీప్తి తనను విడిచిపెట్టినందుకు షణ్ముఖ్ బాధపడుతూ ఆమె స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు తాను భంగం కలిగించనని ఎమోషన్ అయ్యారు. కెరీర్ పై దృష్టిపెట్టాలని తాను షణ్ముక్ తో విడిపోయినట్టు దీప్తి తెలిసింది. ఈ బ్రేకప్ పై హాట్ హాట్ చర్చలు సాగుతున్న వేళ దీప్తి సునయన తాజాగా ఇన్ స్ట్రాగ్రామ్ లైవ్ లోకి వచ్చింది. ఈ సందర్భంగా నెటిజన్ల ప్రశ్నలకు కన్నీళ్ల పర్యంతం అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

    Also Read: సాంగ్ అదిరింది.. రెజీనా, మెగాస్టార్ పోటీ పడి స్టెప్పులేశారు !

    జీవితంలో ఇప్పటికైనా ఏదైనా సాధించాలనుకుంటున్నా.. నా గురించి ఆలోచించుకోవాలనుకుంటున్నా.. నా కెరీర్ ను ఇన్నాళ్లు పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు నా కెరీర్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నానని దీప్తి ‘బ్రేకప్ ’ కు గల కారణాలు వివరిస్తూ కన్నీళ్ల పర్యంతమైంది.

    ప్రస్తుతం దీప్తి సునయన కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీప్తి మాట్లాడిన మాటలు చూస్తుంటే షణ్ముక్ ను నమ్మి తాను మునిగానని.. అతడి గురించి ఆలోచించి తన కెరీర్ నాశనం చేసుకున్నట్టుగా భావిస్తున్నట్టు ఉంది. ఇక బిగ్ బాస్ లో ‘సిరి’తో వ్యవహరించిన తీరుకు షణ్ముక్ సైతం టైటిల్ గెలవకుండా మునిగాడని.. ఇద్దరం సెటిల్ కాకపోవడంతోనే దీప్తి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

    Also Read: ‘రాజ్ తరుణ్’కి బంపర్ ఆఫర్.. రవితేజ అయినా హిట్ ఇస్తాడా ?

    Tags