https://oktelugu.com/

AP CM Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై అందరిలో ఉత్కంఠ?

AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పీఎం నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లను కలిసేందుకు ప్రణాళిక రచించుకున్నారు. ఇందులో భాగంగా రాష్ర్ట ప్రయోజనాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని అపాయింట్ మెంట్ పొందినా ఇంకా అమిత్ షా తో అనుమతి దొరకలేదు. దీంతో జగన్ రాష్ర్ట అభ్యున్నతి కోసం […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 3, 2022 6:29 pm

    CM Jagan

    Follow us on

    AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పీఎం నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లను కలిసేందుకు ప్రణాళిక రచించుకున్నారు. ఇందులో భాగంగా రాష్ర్ట ప్రయోజనాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని అపాయింట్ మెంట్ పొందినా ఇంకా అమిత్ షా తో అనుమతి దొరకలేదు. దీంతో జగన్ రాష్ర్ట అభ్యున్నతి కోసం పలు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.

     

    రాష్ర్ట ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోన్న క్రమంలో జగన్ పర్యటన ఆసక్తి కలిగిస్తోంది. ఢిల్లీలో ప్రధాని ఇతర మంత్రులతో చర్చించి రాష్ర్ట ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరుగుతున్నందున కేంద్రం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేసేలా ఒప్పించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

    Also: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా.. అప్రమత్తంగా ఉండాలని సూచన

    గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల విడుదలలో కూడా ఆలస్యమవుతోంది. దీంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. త్వరగా వాటిని విడుదల చేసి ప్రజల బాధలు తీర్చాలని కోరనున్నట్లు సమాచారం. ఈజీఎస్ పథకంలో రూ. 4.900 కోట్ల నిధులు చెల్లించాలని కోరుతున్నారు. మూడు రాజధానుల వ్యవహారాన్ని కూడా ప్రధానితో చర్చించి కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

    రాష్ర్ట విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చర్చించనున్నారు. నీటి కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన అన్ని బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరనున్నట్లు సమాచారం. దీంతో జగన్ పర్యటనపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. జగన్ ఏ మేరకు సక్సెస్ సాధించి స్టేట్ కు నిధులు రాబడతారోననే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.

    Also: ‘రాజ్ తరుణ్’కి బంపర్ ఆఫర్.. రవితేజ అయినా హిట్ ఇస్తాడా ?

    Tags