https://oktelugu.com/

Deepika Padukone: హాస్పిటల్ లో దీపికా పడుకోణె… ప్రెగ్నెంట్ అంటూ వార్తలు…!

Deepika Padukone: దీపికా పడుకోణె ప్రస్తుతం తన భ‌ర్త రణవీర్ సింగ్ తో దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తోంది. పైగా తమ సంసారం సాఫీగా సాగడానికి దీపికా పడుకోణె అన్ని విధాలుగా తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఆ మధ్య కొత్త బంగ్లా కూడా కొన్నారు. ఐతే, దీపికా ఆరోగ్యం పై కొన్ని రోజులుగా వరుసగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి దీపికా హాస్పిటల్ లో అడ్మిట్ అయిందని ఓ వార్త వైరల్ అవుతుంది. ముంబైలోని ఒక ప్రైవేట్ […]

Written By:
  • Shiva
  • , Updated On : September 29, 2022 / 03:36 PM IST
    Follow us on

    Deepika Padukone: దీపికా పడుకోణె ప్రస్తుతం తన భ‌ర్త రణవీర్ సింగ్ తో దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తోంది. పైగా తమ సంసారం సాఫీగా సాగడానికి దీపికా పడుకోణె అన్ని విధాలుగా తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఆ మధ్య కొత్త బంగ్లా కూడా కొన్నారు. ఐతే, దీపికా ఆరోగ్యం పై కొన్ని రోజులుగా వరుసగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి దీపికా హాస్పిటల్ లో అడ్మిట్ అయిందని ఓ వార్త వైరల్ అవుతుంది.

    Deepika Padukone

    ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో సోమవారం రాత్రి దీపికా పడుకోణె జాయిన్ అయిందట. అసలు దీపికా పడుకోణె ఆరోగ్యానికి ఏమైంది ? అంటూ ఆమె అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఐతే, దీపికా ప్రెగ్నెంట్ అయింది అంటూ.. అందుకే, ఆమె టెస్ట్ ల కోసం హాస్పిటల్ లో జాయిన్ అయిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే, ప్రెగ్నెంట్ లాంటిదేమి లేదని, దీపికా పని ఒత్తిడి వలన కాస్త అనారోగ్యానికి గురైందని తెలుస్తోంది.

    Also Read: Kajal Aggarwal- Pushpa-2: పుష్ప-2లో కాజల్ అగర్వాల్.. ఒక్క సాంగ్ కోసం అంత డబ్బు ఇస్తున్నారా…!

    దీపికా – రణవీర్ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. పైగా ఇద్దరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందుకే, పెళ్లి తర్వాత దీపికా సినిమాలు మానేస్తోంది అని ప్రచారం జరిగింది. కానీ, విచిత్రంగా పెళ్లి తర్వాత దీపికా పదుకొణె ఎక్కువ సినిమాలు అంగీకరిస్తోంది. అన్నిటికీ మించి బోల్డ్ సీన్స్ లో మొహమాటం లేకుండా విచ్చలవిడిగా నటించేస్తోంది దీపికా.

    Deepika Padukone

    ఆ మధ్య వచ్చిన గెహ్రాహియా అనే సినిమాలో దీపికా పదుకొణె నటించింది. సహజంగా స్టార్ హీరోతో పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ పరిధి దాటి ఎక్స్ పోజింగ్ చేయదు. కానీ.. దీపికా మాత్రం ఆ సినిమాలో బికినీ అవతారంలో కనిపించింది. దీనికితోడు హాట్‌ లిప్‌ కిస్సులు కూడా ఇచ్చింది. ఈ సినిమా విషయంలోనే రణవీర్ సింగ్ బాగా ఫీల్ అయ్యాడని ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగిందని టాక్ నడిచింది.

    ‘గెహ్రాహియా’ సినిమా లాంటి చిత్రాల్లో నటించకూడదు అని, గ్లామర్‌ డోస్‌ పెంచకూడదు అని దీపికా కి రణవీర్ కండిషన్ కూడా పెట్టాడట. ఐతే, దీపికా మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లోనూ ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ లో నటించబోతుంది. పైగా అన్నీ భారీ సినిమాలే. చేతిలో అలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టుకుని దీపికా ఎందుకు ప్రేగ్నన్సీ ప్లాన్ చేస్తోంది ?, కాబట్టి.. ఈ వార్తల్లో వాస్తవం లేదు.

    Also Read: Prabhas- YCP MLA: ప్రభాస్ తో వైసీపీ ఎమ్మెల్యే కీలక భేటీ – ఇదిగో ఆధారాలు

    Tags