https://oktelugu.com/

Kajal Aggarwal- Pushpa-2: పుష్ప-2లో కాజల్ అగర్వాల్.. ఒక్క సాంగ్ కోసం అంత డబ్బు ఇస్తున్నారా…!

Kajal Aggarwal- Pushpa-2: చందమామ కాజల్ మరోసారి ఐటెం భామ అవతారం ఎత్తనుందట. పాన్ ఇండియా మూవీ పుష్ప 2లో హాట్ స్టెప్స్ తో కిక్ ఇవ్వనుందట. ఆమె ఫ్యాన్స్ వెర్రెత్తిపోయే న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 15 ఏళ్లకు పైగా సుదీర్ఘ కెరీర్ కాజల్ సొంతం. ఈ పొడుగు సుందరి స్టార్ గా సౌత్ ఇండియాను ఏలేసింది. ముఖ్యంగా టాలీవుడ్ ని చెడుగుడు ఆడుకుంది. మగధీర సినిమాతో కాజల్ దశ తిరగగా… ఇక వెనక్కి […]

Written By:
  • Shiva
  • , Updated On : September 29, 2022 / 03:27 PM IST
    Follow us on

    Kajal Aggarwal- Pushpa-2: చందమామ కాజల్ మరోసారి ఐటెం భామ అవతారం ఎత్తనుందట. పాన్ ఇండియా మూవీ పుష్ప 2లో హాట్ స్టెప్స్ తో కిక్ ఇవ్వనుందట. ఆమె ఫ్యాన్స్ వెర్రెత్తిపోయే న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 15 ఏళ్లకు పైగా సుదీర్ఘ కెరీర్ కాజల్ సొంతం. ఈ పొడుగు సుందరి స్టార్ గా సౌత్ ఇండియాను ఏలేసింది. ముఖ్యంగా టాలీవుడ్ ని చెడుగుడు ఆడుకుంది. మగధీర సినిమాతో కాజల్ దశ తిరగగా… ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2020లో పెళ్లి చేసుకునే వరకు నాన్ స్టాప్ గా సినిమాలు చేసింది.

    Kajal Aggarwal

    ఫార్మ్ లో ఉండగానే కాజల్ పెళ్లి పీటలు ఎక్కింది. లాక్ డౌన్ సమయంలో చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్నారు. కాజల్-గౌతమ్ వివాహం… అత్యంత నిరాడంబరంగా సన్నిహితుల మధ్య జరిగింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో కాజల్ పెళ్ళికి కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించారు. కాగా కాజల్ ఇటీవల పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. కొడుక్కి నీల్ కిచ్లు అని నామకరణం చేసింది.

    Also Read: Pre- Wedding Shoot In Grave: నీ దుంపతెగ.. ఇదేం పోయేకాలం.. సమాధిలో ప్రీ వెడ్డింగ్ షూట్ ఏంట్రా బాబూ

    సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె పుష్ప 2 మూవీలో ఐటెం నంబర్ చేస్తున్నారట. అల్లు అర్జున్-సుకుమార్ ల బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప పార్ట్ 1 లో సమంత ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. పొట్టి గౌను వేసి ”ఊ అంటావా మామా” సాంగ్ కి సమంత వేసిన హాట్ స్టెప్స్ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేశాయి. ఈసారి ఆ బాధ్యత కాజల్ కి అప్పగించారట. పుష్ప 2లో ఐటెం సాంగ్ చేయడానికి కాజల్ ని సంప్రదించడం, ఆమె ఒప్పుకోవడం జరిగిపోయాయట.

    Kajal Aggarwal

    ఇక ఈ సాంగ్ కోసం కాజల్ కి భారీగానే ముట్ట చెబుతున్నారట. ఏకంగా రూ. 1 నుండి 1.5 వరకు కాజల్ రెమ్యూనరేషన్ అని సమాచారం. సమంత ఇంత కంటే ఎక్కువ తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కాగా గతంలో కాజల్ జనతా గ్యారేజ్ మూవీలో ఐటెం సాంగ్ చేశారు. ఎన్టీఆర్ కి జంటగా ” నేను పక్కా లోకల్” అంటూ రెచ్చిపోయి బాడీ షేక్ చేసింది. పుష్ప 2 లో కాజల్ ఐటెం నెంబర్ చేస్తున్నట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. అయినప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ప్రస్తుతం కాజల్ శంకర్-కమల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 షూట్ లో పాల్గొంటున్నారు.

    Also Read: Deepika Padukone- Ranveer Singh: విడిపోతున్న స్టార్ కపుల్ దీపికా-రణ్వీర్… బాలీవుడ్ ని షేక్ చేస్తున్న సంచలన ట్వీట్!

    Tags